Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇంకో కహానీ కూడా వినిపిస్తుంది

By:  Tupaki Desk   |   15 Dec 2016 7:30 AM GMT
వామ్మో.. ఇంకో కహానీ కూడా వినిపిస్తుంది
X
ఓ మూవీ హిట్టైతే దానికి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ రావడం ఈ మధ్య బాలీవుడ్లో కామనైపోయింది. కొత్త సినిమాల కన్నా అల్రెడీ హిట్టైన మూవీకి తర్వాతి భాగాలు తీయడానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ధూమ్ నుంచి కహానీ వరకు చాలా చిత్రాలు ఇలా వచ్చినవే. ఇక కహానీ-2 వచ్చి నెల రోజులు కాలేదు.. అప్పుడే థర్డ్ పార్ట్ తీయడానికి రెడీ అయిపోతున్నాడు డైరెక్టర్.

నాలుగేళ్ల క్రితం విద్యాబాలన్ లీడ్ రోల్ లో వచ్చిన కహానీ ప్రేక్షకుల్ని కట్టిపారేసింది. టైట్ స్ర్కీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ హిట్ ను నమోదు చేయడమే కాదు అవార్డ్స్ మీద అవార్డ్స్ కూడా గెల్చుకొంది. డైరెక్టర్ సుజయ్ ఘోష్ హాలీవుడ్ మూవీస్ ని కాపీ కొట్టి కహానీ తీశాడనే ప్రచారం జరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే కహానీకి సీక్వెల్ వస్తుందంటే పార్ట్ టూ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూశారు. అయితే కహానీ-2 కి ఆశించినంత విజయం దక్కలేదు.

స్టోరీ ముందే ఊహించేలా ఉండటం.. కొంచెం సాగిందన్న కంప్లైంట్స్ కహానీ-2 మీద ఆడియెన్స్ లో పెద్దగా ఆసక్తిని పెంచలేకపోయాయ్. అయితే దర్శకుడు సుజయ్ ఘోష్ మాత్రం కహానీ సిరీస్ మీద ప్రేమ వదులుకోలేకపోతున్నాడు. కహానీ-2 నిరాశపర్చింది కానీ విద్యాబాలన్ తన పాత్రకి న్యాయం చేసింది. అందుకే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇంకో కహానీని తీయడానికి నేను రెడీ అంటున్నాడు. విద్యాబాలన్ తప్ప కహానీ సిరీస్ కి ఎవ్వరూ న్యాయం చేయలేరు కాబట్టి మళ్లీ విద్యానే నా హీరోయిన్ అంటున్నాడు. మరి మూడో కహానీ అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా.. పార్ట్-2 లా తేలిపోతుందా చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/