Begin typing your search above and press return to search.

రొమాన్స్ కోసం మ‌ళ్లీ పాత రోజుల్లోకి వెళ్లాల్సిందేనా?

By:  Tupaki Desk   |   16 April 2020 10:15 AM IST
రొమాన్స్ కోసం మ‌ళ్లీ పాత రోజుల్లోకి వెళ్లాల్సిందేనా?
X
క‌రోనా దెబ్బ‌కి మ‌నిషికి మ‌నిషే శ‌త్రువ‌య్యాడు. మందు.. వ్యాక్సిన్ లేని మ‌హ‌మ్మారి ఇది. దీనికి ప‌ర్మినెంట్ సొల్యుష‌న్ ఎప్ప‌టికి దొరుకుతుంద‌న్న‌ది తెలియ‌ని ప‌రిస్థితి. కొవిడ్ -19 వ‌స్తే బాడీలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ ఒక్క‌టే మ‌నిషిని బ్ర‌తికించ గ‌ల‌దు. లేదంటే! చేతులెత్తేయ‌డం త‌ప్ప చేసేదేమీ లేద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టాలంటే సామాజిక దూరం పాటించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని చెబుతున్నారు. మ‌నిషికి...మ‌నిషికి మ‌ధ్య మీట‌ర్ దూరం ఉండాలి. ఒక‌ర్ని ఒక‌రు ముట్టుకోవ‌డానికి లేదు. మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్టే వ‌ర‌కూ ప్రపంచంలో ప్ర‌తీ పౌరుడు పాటించాల్సిన విధి ఇద‌ని ప్ర‌భుత్వాలు గ‌ట్టిగా చెబుతున్నాయి.

ఇలా ఎన్నాళ్లు చేయాల‌న్న‌ది క్లారిటీ లేదు. అయితే బాలీవుడ్ డైరెక్ట‌ర్ సుజిత్ స‌ర్కార్ కి ఓ ధ‌ర్మ సందేహం వ‌చ్చింది. అది అత‌నిలో రొమాంటిక్ డౌట్. ప్ర‌స్తుతానికైతే అంతా సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తారు. మ‌రి త‌ర్వాత మా సినిమా వాళ్ల ప‌రిస్థితి ఏంటి? అని ఓ సందేహం వ్య‌క్తం చేసారు. బాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రియాల్టీ కోసం ఎంత దూర‌మైన వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. పెద‌వి ముద్దులు...బెడ్ రూమ్ స‌న్నివేశాలు...బాత్ రూమ్ సీన్లు... ఇలా ఎన్నో ఇబ్బ‌డి మబ్బ‌డిగా బాలీవుడ్ సినిమాల్లో త‌రుచూ ఉండే స‌న్నివేశాలు. అవ‌న్నీ రియ‌ల్ గానే ఉండాయి. వాటిలో డూప్ గ‌ట్రా ఉండ‌దు. సీన్ ప‌డ్డాలంటే రియాల్టీ ఉండాలంటారు. ఆయ‌న వెర్ష‌న్ క‌రెక్ట్ గానే ఉంది.

సోష‌ల్ డిస్టెన్స్ పేరుతో ఎంత కాలం దూరం దూరంగా ఉండ‌గ‌ల‌రు? క‌రోనా చైన్ ప్రోస‌స్ తెంచాల‌న్న ఆలోచ‌న బాగానే ఉంది! కానీ ఇలా సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం ఎంత కాలం అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు. కాబ‌ట్టి ఎంత వ‌ర‌కూ ఆచ‌ర‌ణ‌లో ఉంటుంద‌న్న‌ది చూడాలి. ఇక టాలీవుడ్ లోనూ రొమాంటిక్ సినిమాలు ఇటీవ‌ల హ‌ద్దు మీరుతున్న సంగ‌తి తెలిసిందే. రియాల్టీ కోసం మ‌న హీరోలు..హీరోయిన్లు అంతే దూకుడు చూపిస్తున్నారు. క్రియేట‌ర్ అంచాన‌ల్ని మించి రొమాంటిక్ స‌న్నివేల్లో ఒదిగిపోతున్నారు. ఒక‌ప్పుడు రొమాంటిక్ సీన్స్ అంటే డూప్ పెట్టి చేసే వారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. మ‌రి కరోనా క‌ష్ట కాలంలో మ‌ళ్లీ పాత రోజుల్లోకి తొంగి చూడాల్సి వ‌స్తుందేమో.