Begin typing your search above and press return to search.

బెల్లంకొండ బాలీవుడ్‌ జర్నీ 'సాహో' డైరెక్టర్‌ తో షురూ?

By:  Tupaki Desk   |   17 Nov 2020 1:40 PM IST
బెల్లంకొండ బాలీవుడ్‌ జర్నీ సాహో డైరెక్టర్‌ తో షురూ?
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా హిందీలో చత్రపతి సినిమా రీమేక్‌ అవ్వబోతుంది అంటూ వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఇప్పటికే రీమేక్‌ కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేసిందంటున్నారు. తన డబ్బింగ్‌ సినిమాలతో హిందీలో మంచి పాపులారిటీని దక్కించుకున్న బెల్లంకొండ చత్రపతి సినిమాతో ఖచ్చితంగా అక్కడ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారట. ఈ భారీ సినిమాకు దర్శకుడు కూడా తెలుగు దర్శకుడే అంటూ సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌ ప్రేక్షకులను సాహోతో సర్‌ ప్రైజ్‌ చేసిన సుజీత్‌ కు చత్రపతి హిందీ రీమేక్‌ బాధ్యతలను అప్పగించే విషయమై సీరియస్‌ గా చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే రెడీ అయిన స్ర్కిప్ట్‌ ను ఆయన చేతిలో పెట్టబోతున్నారనే వార్తలు మీడియా సర్కిల్స్‌ లో వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ టేస్ట్‌ కు తగ్గట్లుగా సుజీత్‌ భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా చత్రపతిని రీమేక్‌ చేయగల సత్తా సుజీత్‌ కు ఉందంటూ అంతా నమ్మకంగా ఉన్నారట.

ఇదే కనుక నిజం అయితే హిందీలో వీరిద్దరికి మంచి స్టార్‌ డం దక్కడం ఖాయం. చత్రపతి రీమేక్‌ గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు అయితే వస్తున్నాయి కాని ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ అయితే రాలేదు. కాని ఖండన కూడా రాకపోవడంతో సినిమా ఖచ్చితంగా రీమేక్‌ చేసే యోచనలో అయితే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.