Begin typing your search above and press return to search.

న‌క్కతోక తొక్కిన‌ యంగ్ డైరెట్రు

By:  Tupaki Desk   |   25 Oct 2018 3:57 AM GMT
న‌క్కతోక తొక్కిన‌ యంగ్ డైరెట్రు
X
ఓవ‌ర్‌ నైట్ స్టార్‌ డ‌మ్ అని సింగిల్ వ‌ర్డ్ ఉప‌యోగించేస్తాం కానీ, దాని వెన‌క ఎంతో క‌ఠోర శ్ర‌మ‌ - త‌ప‌న‌ - వెయిటింగ్ ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో అసాధార‌ణ క్రేజుతో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల్ని ప‌రిశీలిస్తే వీళ్లెవ‌రూ ఓర‌ర్‌ నైట్ స్టార్‌ డ‌మ్‌ తో ఇక్క‌డ వెలిగిపోవ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం.

చందు మొండేటి - సుధీర్ వ‌ర్మ‌ - హ‌ను రాఘ‌వ‌పూడి - మారుతి - సుజీత్ - ప్ర‌శాంత్ వ‌ర్మ - జిల్ రాధాకృష్ణ‌ .. వీళ్లంతా ఓవ‌ర్‌ నైట్ డైరెక్ట‌ర్లు అయిపోలేదు. ఎంతో కాలం వేచి చూస్తే కానీ ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం రాలేదు. ప్ర‌తిభ‌ను నిరూపించుకునేందుకు చాలానే చేశారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాము ఏం చేస్తున్నా.. ప్రేక్ష‌కాభిమానులు - ప‌రిశ్ర‌మ త‌మ‌వైపు చూసేలా చేసుకున్న ప్ర‌తిభ వీళ్ల‌ది. వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఇంత‌మందిలో యంగ్ బోయ్‌ సుజీత్ మ‌రింత‌ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌ గా నిలిచాడు. అందుకు కార‌ణం డార్లింగ్ ప్ర‌భాస్‌ తో సినిమా చేస్తుండ‌డ‌మే. బాహుబ‌లి ప్ర‌భాస్ తో సుజీత్ అనే పాతికేళ్ల కుర్రాడు (`సాహో` పని మొద‌ల‌య్యేప్ప‌టికి ఏజ్‌) ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ తీస్తున్నాడు అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం సుజీత్ రెండేళ్లు పైగానే వేచి చూశాడు. ఇప్పుడా వెయిటింగ్ ఫ‌లిస్తోంది. సాహో కీల‌క‌మైన షెడ్యూల్స్ పూర్త‌య్యాక టీజ‌ర్‌ - మేకింగ్ వ‌చ్చాక జ‌నాల‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. సుజీత్ ఓ ప్రామిస్సింగ్ సినిమా చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మొన్న ప్ర‌భాస్ బ‌ర్త్‌ డే కానుక‌గా రిలీజ్ చేసిన సాహో మేకింగ్1 కోటి వ్యూస్ క్ల‌బ్‌ లో చేరింది. 2.ఓ మేకింగ్ వీడియో త‌ర‌హాలో అంత‌ర్జాలంలో జెట్ స్పీడ్‌ తో దూసుకుపోతోంది. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ టీజ‌ర్‌ ని మించిన స్పీడ్‌ తో వెళుతోంది. డార్లింగ్ ప్ర‌భాస్ సినిమా వ‌ల్ల సుజీత్ గ్రాఫ్ అమాంతం పెరగ‌డం ఖాయం అన్న భ‌రోసా ఇది. ఓ ర‌కంగా యంగ్ డైరెక్ట‌ర్ న‌క్క తోక తొక్కిన‌ట్టే. ప్ర‌భాస్ కోసం వేచి చూసినందుకు.. గొప్ప విజ‌న్‌ తో ప‌ని చేస్తున్నందుకు ఇది సింబాలిక్‌ గా నిలుస్తోంది. సుజీత్ ఈ సినిమాతో రాజ‌మౌళి - శంక‌ర్ అంత మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

ఒక్క సుజీత్‌ కి మాత్ర‌మే కాదు.. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులంద‌రికీ రాజ‌మౌళి - శంక‌ర్ అంత భ‌విష్య‌త్ ఉండాలి.. అలా ఉండాలంటే అంత పెద్ద విజ‌న్ కూడా ఉండి తీరాలి. చందు మొండేటి - మారుతి - సుధీర్ వ‌ర్మ‌ - హ‌ను రాఘ‌వ‌పూడి - సుజీత్ - ప్ర‌శాంత్ వ‌ర్మ .. వీళ్లెవ‌రూ త‌క్కువేం కాదు. వీళ్లంతా స‌త్తా ఉన్న‌వాళ్లే.. వైవిధ్యం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకుంటూ.. పెద్ద ఛాన్సులొస్తే నిరూపించుకునే దిమాకున్నోళ్లే. ఆ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిద్దాం.