Begin typing your search above and press return to search.

సుజిత్ కు మళ్ళీ పనిపెట్టిన చిరు?

By:  Tupaki Desk   |   23 May 2020 9:10 AM GMT
సుజిత్ కు మళ్ళీ పనిపెట్టిన చిరు?
X
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను మెగాస్టార్ రీమేక్ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కు దాదాపుగా పూర్తి చేసిన సుజిత్ ఇటీవల చిరు వద్దకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. చిరు ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారట.

సాహో సినిమాలు భారీ తారగణంను బాగా హ్యాండిల్ చేసిన సుజిత్ ఇప్పడు లూసీఫర్ రీమేక్ కు తప్పకుండా ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది.

షూటింగ్స్ ప్రారంభం అయితే కేవలం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో లూసీఫర్ సినిమా రీమేక్ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. లూసీఫర్ సినిమా ను పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని చిరు సూచించారని, దాంతో మళ్ళీ సుజిత్ ఆ పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.