Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఆత్మహత్యకు తెలుగు ప్రియుడు కారణమా?
By: Tupaki Desk | 2 Oct 2021 7:00 AM ISTకన్నడ నటి సౌజన్య ఆత్మహత్య ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సౌజన్య ఆత్మహత్య నోట్ లో తన చావుకు ఎవరు కారణం కాదు అని క్లీయర్ గా రాసింది. నాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది అని తెలుసు.. మంచి భవిష్యత్తు ఉందని తెలుసు.. కాని నాకు గత కొన్నాళ్లుగా మానసికంగా ప్రశాంతత లేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ ఆత్మహత్యకు దయచేసి ఏ ఒక్కరిని బాధ్యులను చేయకూడదు అంటూ కుటుంబ సభ్యులను మరియు పోలీసులను సౌజన్య లేఖలో కోరింది. మొదట పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగానే నమోదు చేయాలనుకున్నా కూడా సౌజన్య తండ్రి మాదప్ప మాత్రం తన కూతురుది ఆత్మహత్య కాదని.. అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశాడు. తెలుగు నటుడు కారణం అని.. అతడు గత కొన్ని రోజులుగా సౌజన్య ను పెళ్లి చేసుకుందాం అని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ విషయాన్ని ఆమె బయటకు చెప్పలేక మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యకు ఒడి గట్టి ఉంటుందని మాదప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.
సౌజన్య ప్రియుడితోనే కలిసి ఉంటుంది. ప్రియుడు ఉదయాన్నే టిఫిన్ తీసుకు వచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో సౌజన్య ముందుగానే రెడీ చేసుకున్న సూసైట్ నోట్ ను బయటకు తీసి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. బయట నుండి తిరిగి వచ్చిన ప్రియుడు రూములో సౌజన్య ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ కు గురి అయ్యాడు. పోలీసులకు సమాచారం ఆయనే ఇచ్చాడని తెలుస్తోంది. పోలీసుల ఎంక్వౌరీ ప్రారంభంకు ముందు అతడు పారిపోయాడు. అతడు తనకు ఈ ఆత్మహత్యకు సంబంధం లేదు అన్నట్లుగా చెబుతున్నాడు. కాని ఆమె తండ్రి మాత్రం అతడే తన కూతురు చంపేసింది అంటూ బలంగా వాదిస్తున్నాడు. ఈ కేసు ను విచారిస్తున్న పోలీసులు అతి త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నారు.
కన్నడంలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో బుల్లి తెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. సవి మాదప్ప గా పేరున్న సౌజన్య మరణ వార్త కన్నడ బుల్లి తెర ప్రేక్షకుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఎంతగా సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎదిరించి నిలవాలని.. అలా కాకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు సూచిస్తున్నారు. నటిగా మంచి భవిష్యత్తు ఉండటంతో పాటు అన్ని విధాలుగా ఆఫర్లు వస్తున్న సౌజన్య ఆత్మహత్య చేసుకోవడం వర్థమాన నటీ నటులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారంలోనే కుటుంబ సభ్యులు అంగీకరించరు అనే ఉద్దేశ్యంతో సౌజన్య మృతి చెంది ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.