Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సుహాసిని అద్భుత క్షణాలు

By:  Tupaki Desk   |   10 Jun 2017 12:41 PM IST
ఫోటో స్టోరి: సుహాసిని అద్భుత క్షణాలు
X
సౌత్ ఇండియా సినిమాలో 80 దశకానికి చాల గొప్ప చరిత్ర ఉంది. ఆ కాలమే దేశానికి గర్వించదగ్గ నటులును సూపర్ స్టార్స్ ని మెగా స్టార్స్ ని అందించింది. ఇప్పుడు వీళ్ళ లో కొంత మంది సినిమాకు గుడ్ బై చెప్పినా.. చిరంజీవి - రజినీకాంత్ - రాధిక - మోహన్ లాల్ - ఖుష్బూ ఇలా ఇప్పటికీ టాప్ స్థానాలలో కొనసాగుతున్నారు. వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రతి ఏటా ఎక్కడైనా ఒక చోట కలిసి సరదాగా గడుపుతారు. ఈ సారి వీళ్ళంతా చైనా వెళ్లారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

స్నేహితులు తో సరదాగా గడుపుతూ ప్రపంచంలోనే ఎత్తయిన.. చైనా లోని షాంగాయ్ టవర్ వద్ద ఇలా సెల్ఫి తీసుకుంది సిరివెన్నల తార సుహాసిని. తాను సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోనూ.. తాను సెల్ఫీ తీసుకున్న ఫోటోనూ షేర్ చేస్తూ.. నా ఆనందం అంబరానికి చేరింది భూమంతా చిన్నదైంది.. అంటూ తెగ సంబరపడిపోయింది. నిజంగానే ఇవి అద్భుత క్షణాలు కదూ. ఈ రీయూనియన్ ప్లాన్ లో సుహాసిని పాత్ర చాలా ఉంది. తన సహనటి లిజి తో కలిసి ఈ ఆలోచనను మొదలుపెట్టారు. దీనిలో 80 లో ఉన్న స్టార్స్ చాలావరకు అందరూ ఉన్నారు దీనికి వీళ్ళు ఎవర్ గ్రీన్ 80s అని పేరు పెట్టుకున్నారు.

సుహాసిని ఇప్పుడు తమిళ్ టి‌వి లో ఒక వీకెండ్ షో హోస్ట్ చేస్తుంది. ఈ షో షూటింగ్లో దొరికిన కొన్ని రోజులు గ్యాప్ తో తన మిత్ర బృంధం తో కలిసి బాగానే ఎంజాయ్ చేసింది. ఈ యూనియన్ లో ఇప్పటికే మన మెగా స్టార్ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నాడు. ఇప్పుడు సుహాసినీ సెల్ఫీ కూడా అందులో జాయినైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/