Begin typing your search above and press return to search.

సుహాసిని పెళ్లి కూతురాయనే..

By:  Tupaki Desk   |   26 Feb 2016 11:29 AM GMT
సుహాసిని పెళ్లి కూతురాయనే..
X
తెలుగమ్మాయి సుహాసిని పెళ్లి కూతురైంది. చంటిగాడు సినిమాతో తెరంగేట్రం చేసిన సుహాసిని.. తర్వాత పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే చేసినా.. తమిళ్, కన్నడలతో పాటు భోజ్ పురి మూవీస్ లోనూ మెరిసింది. ఇప్పుడీ హీరోయిన్ పెళ్లి నిశ్చయమైంది. నటుడు రాజాతో సుహాసినికి తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది.

త్వరలో వివాహం చేసుకోనున్న ఈ జంట.. తమ నిశ్చితార్ధం ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. చంటిగాడుతో హీరోయిన్ గా పరిచయమైనా.. కేవలం అవే పాత్రలకు పరిమితంగా కాలేదు ఈమె. అడ్డా - రఫ్ వంటి చిత్రాల్లో ఈమె పోషించిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. అంతే కాకుండా.. టీవీ సీరియల్స్ లో కూడా మంచి మార్కులనే పొందింది. అష్టాచెమ్మా - అపరంజి - ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ ద్వారా.. బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరైంది.

ఈమె కాబోయే భర్త రాజా కూడా టీవీ నటుడే. అనేక సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తున్నాడు. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని అందరి ఫ్రశంసలు అందుకుంటున్నారు. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ నుంచి బుల్లి తెర బాట పట్టిన సుహాసిని.. అక్కడే జీవిత భాగస్వామిని కూడా వెతుక్కోవడం విశేషమే.