Begin typing your search above and press return to search.

కాబోయే హీరోయిన్లు.. అప్పుడే స్టార్ట్ చేసేశారు

By:  Tupaki Desk   |   25 Dec 2017 9:20 AM GMT
కాబోయే హీరోయిన్లు.. అప్పుడే స్టార్ట్ చేసేశారు
X

బాలీవుడ్ లో వారసత్వం అనే విషయం కొత్తేమీ కాదు. నెపోటిజం అంటూ కొందరు టాప్ భామలు ఎంతగా మాట్లాడినా.. అవన్నీ డిస్కషన్స్ కోసం తప్ప మరెందుకూ ఉపయోగపడవు. ఇప్పటికే బోలెడంత మంది వారసులు ఇండస్ట్రీలో ఉండగా.. ఇకపై రాబోయే వారి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

నెక్ట్స్ జనరేషన్ లో బాలీవుడ్ ను ఊపేస్తుందనే అంచనాలు ఉన్న భామలు చాలామందే ఉన్నారు. వీరిలో కింగ్ ఖాన్ షారూక్ కూతురు సుహానా కూడా ఉంటుంది. ఆన్ లైన్ లో ఈమె ఫోటోలు తెగ వైరల్ గా షేర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏకంగా అమ్మ గౌరీ ఖాన్ స్వయంగా.. తన కూతురు గ్లామర్ డ్రెసింగ్ లో ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న సుహానా ఖాన్.. అందాలను చూపించీ చూపకుండా భలే చూడముచ్చటగా ఉంది.

ఇదే ఫోటోలో సుహానాతో పాటు మరో టీనేజ్ బ్యూటీ కూడా మెరిసిపోతోంది. ఈమె ఎవరో కాదు.. గౌరీ ఖాన్ సోదరుడు విక్రాంత్ కూతురు అయిన ఆలియా చిబ్బా. కజిన్ సిస్టర్స్ అయిన ఈ ఇద్దరు కుర్ర భామలు అందాల మెరుపులను తెగ ఎగ్జిబిట్ చేసేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక సినిమాల్లోకి వచ్చాక మరెంత గ్లామర్ కురిపిస్తారో అనుకుంటున్నారు కుర్రకారు.