Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ కోసం షారూక్ కూతురు ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   5 May 2018 6:47 AM GMT
ఫ్రెండ్ కోసం షారూక్ కూతురు ఏం చేసిందంటే?
X
తన కూతురు గురించి షారూక్ ఖాన్ చెప్పే సంగతులు భలే ఉంటాయి. ఆమె వంక చూసినా కళ్లు పీకేస్తా టైపులో కబుర్లు చెబుతూ ఉంటాడు. కానీ ఈ టీనేజ్ భామ మాత్రం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ ఉంటుంది. రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ అనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.

ఈమెకు కూడా యాక్టింగ్ అంటే మహా ఇష్టం. ఆ విషయం షారూక్ కూడా ఒప్పుకున్నాడు. కాకపోతే తమ ఇంట్లో ఏదైనా కెరీర్ ను ఎంచుకోవాలంటే.. ముందుగా డిగ్రీ పూర్తి చేయడం అన్నది మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పేయడంతో.. అప్పటివరకూ సుహానా ఖాన్ వెయిట్ చేయక తప్పదు. అంటే కనీసం ఇంకో నాలుగైదేళ్లు పడుతుందన్న మాట. అయితే.. అప్పటివరకూ ఈ బ్యూటీ ఏమీ సింపుల్ గా ఉండడం లేదు. సోషల్ మీడియా బేస్డ్ గా రచ్చ చేస్తూనే ఉంటుంది. పైగా ఈమెకు ఫాలోయర్స్ తెగ ఎక్కువ కావడంతో.. సుహానా ప్రతీ ఫోటో వైరల్ గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది.

రీసెంట్ గా సుహానా ఖాన్ తన స్నేహితురాళ్లతో కలిసి చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తన ఫ్రెండ్ ఓ అమ్మాయికి.. సుహానా హెయిర్ స్పా చేస్తూ ఉంటుంది. మరో స్నేహితురాలు కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ముగ్గురు కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో.. స్నేహాన్ని ఎలా ఆనందిస్తున్నారో ఈ చిన్నవీడియోలో చూడచ్చు. ఇలాంటి ట్రెండీ బ్యూటీ కోసం బాలీవుడ్ ఎదురుచూడడం సహజమే కదా మరి.