Begin typing your search above and press return to search.

ఖాన్ బ్యూటీ-హౌ స్వీటీ

By:  Tupaki Desk   |   1 Jan 2018 8:15 AM GMT
ఖాన్ బ్యూటీ-హౌ స్వీటీ
X
ఎంతైనా స్టార్ హీరో కూతురు. అందులోనూ తన తెరమీదకు ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టు తను కూడా ఈ మధ్య సోషల్ లైఫ్ లో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాను అని ఫోటో షూట్స్ ద్వారా హింట్ ఇస్తూనే ఉంది. షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ వైపు తన అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. తరచుగా సెలెబ్రిటీలు నిర్వహించే పార్టీలకు అమ్మానాన్నతో హాజరువుతున్న సుహానా ఖాన్ తో సినిమా చేయడానికి నిర్మాతలు రెడీ గా ఉన్నారు కాని షారుఖ్ మరో ఏడాది లేదా రెండేళ్ళు ఆగండి అని ఆపుతున్నాడు. పైన స్టిల్ చూసారుగా. ఒక పెళ్లి అటెండ్ అవ్వడం కోసం వచ్చిన సుహానా ఖాన్ ఆకుపచ్చ లేహెంగాతో చక్కని ఎంబోజింగ్ వర్క్ తో డిజైన్ చేసిన డ్రెస్ లో సూపర్ అనిపించేసింది. నగలు ఆడంబరాలు లేకుండా వచ్చిన సుహానాను చూసి కళ్ళు పక్కకు తిప్పుకున్న వారు లేరు.

కేవలం నడుమును మాత్రమే వయ్యారంగా చూపిస్తూ ఇంకే భాగం ఎక్స్ పోజ్ కాకుండా చాలా పద్దతిగా కట్టుకున్న తీరుని అందరూ ముచ్చట పడుతున్నారు. హీరోల కూతుళ్ళు పరిచయం కావడం కొత్తేమి కాదు కాని ఖాన్ ద్వయంలో మాత్రం సుహానా ఖాన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరొయిన్ అవుతుంది. అందుకే తన మీద అంత ఆసక్తి ఉంది. కపూర్ కుటుంబాల నుంచి వచ్చిన వారసురాళ్ళే తప్ప ప్రస్తుతానికి ఇంకెవరు ఇండస్ట్రీలో లేరు. అందుకే ఖాన్ బ్యాచ్ నుంచి వస్తున్న సుహానా అంటే క్రేజ్ నెలకొని ఉంది. ప్రస్తుతానికి సుహానా ఫోటోలతో సర్డుకోవాల్సిందే. త్వరలోనే కరణ్ జోహార్ లేదా యష్ సంస్థ ద్వారా ఒక చక్కని ఎంటర్టైనర్ ద్వారానే సుహానాని పరిచయం చేసే ప్లాన్ లో ఉన్నాడు షారుఖ్. ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.