Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మెరుపు కాదు ఉరుము

By:  Tupaki Desk   |   1 Aug 2018 6:51 AM GMT
ఫోటో స్టోరీ: మెరుపు కాదు ఉరుము
X

మెరుపు కాదు ఉరుము వ‌చ్చి మీద ప‌డ‌బోతోంది. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!! ఔను ఇది నిజం. ఒక‌వేళ సందేహాలేవైనా ఉంటే ఇదిగో ఈ పోటో చూశాక ఆ మాట నిజ‌మేన‌ని మీరే అంగీక‌రిస్తారు. సైఫ్ డాట‌ర్‌ - శ్రీ‌దేవి డాట‌ర్ అంటూ ఇన్నాళ్లు ముచ్చ‌ట్లు సాగాయ్‌. ఇక‌మీద‌ట కింగ్‌ ఖాన్ డాట‌ర్‌.. షారూక్ గారాల‌ప‌ట్టీ అంటూ ముచ్చ‌ట్లు పెరిగిపోతాయ్‌. తొంద‌ర్లోనే ఎంట‌ర్ ది డ్రాగ‌న్ అంటూ ఖాన్ డాట‌ర్ సుహానా బ‌రిలో దిగిపోతోంది. క‌థానాయిక‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది..

చూడ‌టానికి సూదంటు రాయిలా షార్ప్ నోస్‌ తో డాడ్‌ ని పోలి క‌నిపించే ఈ అమ్మాయి షారూక్‌ లానే చిలిపి పిల్ల‌లాగా ఉంటుందేమో అని అనుకుంటారంతా. కానీ ఖాన్ డాట‌ర్ ఎంతో డీసెంట్‌. ప్ర‌స్తుతం లండ‌న్‌ లో చ‌దువుకుంటోంది. స్ట‌డీస్ ఇంకా పూర్తి కాలేదు. అక్క‌డ స్ట‌డీస్ సాగుతుండ‌గానే మ‌ధ్య‌లో మామ్ - డాడ్‌ ని చూసి వెళ్లేందుకు వ‌స్తుంటుంది. అలా వ‌చ్చిన‌ప్పుడు క‌ర‌ణ్ జోహార్ త‌న‌కు యాక్టింగ్ టిప్స్‌ ని ఇస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా అప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక ఫోటోషూట్ పేరుతో హ‌డావుడి చేసి సుహానా మ‌ళ్లీ మాయ‌మ‌వుతోంది. ఇక తొలి సారి త‌న లైఫ్ లో అస‌లు సిస‌లు ఫోటోషూట్ వోగ్ క‌వ‌ర్‌ షూట్ తాజాగా రివీలైంది. ఈ ఫోటోషూట్‌ ని డాడ్ షారూక్ ఖాన్ వోగ్ అవార్డ్స్ వేళ‌ స్వ‌యంగా లాంచ్ చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా వోగ్‌ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సుహానా ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది. త‌న‌కు ఉన్న ఆప్ష‌న్ న‌ట‌న అని చెప్ప‌క‌నే చెప్పింది. సుహానా అల్ట్రా మోడ్ర‌న్ లుక్ ప్ర‌స్తుతం కుర్రాళ్ల గుండెల్లోకి సూటిగా దూసుకుపోతోంది.