Begin typing your search above and press return to search.

స్టార్ హీరో డాటర్.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   3 May 2018 7:47 AM GMT
స్టార్ హీరో డాటర్.. వీడియో వైరల్
X
బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక టీనేజ్ సెలబ్రెటీ అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సోషల్. మీడియాలో అయితే ఆమెకు సంబంధించిన వీడియోలు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సెలబ్రెటీ ఎవరో కాదు. షారుక్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్. ఈ 17 ఏళ్ల గర్ల్ ఎక్కడా కనిపించినా సరే కెమెరాలను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకోవడం కామన్ అయిపోయింది.

పైగా ఖరీదైన షూస్ వేయడం డ్రెస్సింగ్ లో కూడా తన బ్రాండింగ్ లెవెల్ ను చూపించడం అమ్మడికి అలవాటే. సుహానాకు తండ్రి షారుక్ ఇచ్చిన ఫ్రీడమ్ ఏ లెవెల్లో ఉందొ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. గ్లామర్ గర్ల్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా కనిపిస్తుంటుంది. ఇకపోతే రీసెంట్ గా ఆమె సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లండన్ లో తన ఫ్రెండ్స్ తో మ్యూజికల్ చైర్ ఆడుకుంటూ కనిపించింది.

వీడియో లో వివిద రాకల దేశాలకు చెందిన అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇంగ్లీష్ భామలతో సుహానా షారుక్ స్నేహాన్ని గట్టిగానే మెయింటైన్ చేస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చివరగా సుహానా జయా బచ్చన్ బర్త్ డే వేడుకల్లో కనిపించింది. ఆ తరువాత ఇండియాలో మరెక్కడా కనిపించలేదు. త్వరలోనే వారి సొంత టీమ్ కేకేఆర్ ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించడానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి