Begin typing your search above and press return to search.

హీరో కూతురు మళ్లీ ఖర్చు చేసిందే..

By:  Tupaki Desk   |   3 Nov 2017 8:14 AM GMT
హీరో కూతురు మళ్లీ ఖర్చు చేసిందే..
X
స్టార్ హీరోల పిల్లలు కొంతమంది ఏ రేంజ్ లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు బయటకు వస్తే చాలు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారా అని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఫ్యాషన్ ప్రపంచాన్నీ ముందుగానే అలవాటు చేసుకుంటున్నారు. సినిమాల్లోకి రాకముందే మోడల్స్ రేంజ్ లో కాస్ట్లీ డ్రెస్సులతో దర్శనం ఇస్తున్నారు. అలాగే గ్లామర్ డోస్ ని కూడా బాగానే పెంచేస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ కూడా స్టార్ హీరోయిన్స్ వేయలేని ఖరీదైన దుస్తులను - షూలని వేస్తోంది. అంతే కాకుండా కొంచెం ఘాటుగానే కనిపిస్తోంది. రీసేంట్ గా దీపావళి వేడుకల కోసం తన స్నేహితుల ఇంటికి వెళ్లిన సుహాన ఖరీదైన స్నికర్స్ తో కనిపించింది. ఇప్పుడు మళ్లి అంతకంటే ఎక్కువ రేంజ్ లో టాప్ టూ బాటమ్ అన్నిట్లో కాస్త కాస్ట్లీ లుక్ మెయింటైన్ చేసింది.

ఆమె ధరించిన షార్ట్ అండ్ గివెన్చి టి-షర్ట్ మరియు తెలుపు స్నీకర్లకి దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇక అమ్మడు వేసిన డ్రెస్సును చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని బాలీవుడ్ మీడియా లో కథనాలు వినిపిస్తున్నాయి.