Begin typing your search above and press return to search.

ఖాన్ మెహెందీ అదిరింది

By:  Tupaki Desk   |   5 Jan 2018 12:13 PM GMT
ఖాన్ మెహెందీ అదిరింది
X
హింది సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎన్నటికి మర్చిపోలేని పాట మెహెందీ లగాకె రక్నా డోలి సజా కె రక్నా. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలోని ఆ పాట ఇప్పటికి అన్ని రకాల పెళ్లి వేడుకల్లో వాడుతూనే ఉంటారు. ఆ ఒక్క సినిమా దెబ్బకు షారుఖ్ ఖాన్ ఆల్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. అందులో ప్రతి పాటా దేశమంతటా మారుమ్రోగిపోయాయి. ముంబై మరాటా మందిర్ లో ఇప్పటికీ రోజు ఒక మార్నింగ్ షో ప్రదర్శిస్తున్నారు. గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న ఈ సినిమా షారుఖ్ ఖాన్ ఎంతో ప్రత్యేకం. మరి పాటలో చెప్పుకున్న ఆ గోరింటాకు(మెహెందీ)ఇప్పుడు తన కూతురు ఒక పెళ్లి వేడుకలో వేసుకుని తిరుగుతూ ఉంటె షారుఖ్ ఖాన్ కు అంత కన్నా ఆనందం ఏముంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ పిక్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది.

ఇటీవలే ముంబైలో జరిగిన ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి తన ఫ్యామిలీతో సహా వచ్చిన షారుఖ్ ఖాన్ కన్నా తన కూతురు ఎక్కువ సందడి చేయటం వచ్చిన వారందరి దృష్టి అటువైపు మళ్లేలా చేసింది. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుని ఖరీదైన సాంప్రదాయ లేహెంగా ధరించి చెంగు చెంగు మంటూ సుహానా ఖాన్ తిరుగుతూ ఉంటే షారుఖ్ ఖాన్ ఊరికే ఉంటాడా. వెంటనే ఆ జ్ఞాపకాలను ఫోటోల రూపంలో తీసుకోవడం మొదలు పెట్టాడు. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కోసం సుహాన ఖాన్ ను సిద్ధం చేస్తున్న షారుఖ్ ఖాన్ వచ్చే ఏడాది నాటికి తనను హీరొయిన్ గా చూసే ప్రయత్నాల్లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కథనం. ఇంకా సినిమాల్లోకి రాకముందే సుహానా ఖాన్ కు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 2 లక్షలకు చేరువలో ఇన్స్టా గ్రామ్ లో ఫాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ పిక్స్ ను షేర్ చేసుకున్న సుహానా ఎంట్రీ కోసం వాళ్ళే కాదు బాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.