Begin typing your search above and press return to search.

స్టార్ డాట‌ర్ హ‌గ్.. ఆ విదేశీ చిలిపి స్నేహితుడు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   15 May 2021 4:30 PM GMT
స్టార్ డాట‌ర్ హ‌గ్.. ఆ విదేశీ చిలిపి స్నేహితుడు ఎవ‌రు?
X
షారూఖ్ ఖాన్- గౌరీ ఖాన్ ల గారాల‌ కుమార్తె సుహానా ఖాన్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఇటీవల ఆమె అమెరికాకు బయలుదేరినప్పుడు అద్భుతమైన ఫోటోలను పంచుకుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ నవ్య నవేలి నందా ఆ ఫోటోల‌పై స్వీట్ కామెంట్ తో సెండాఫ్ చెప్పింది. సుహానా ఖాన్ ఇటీవ‌ల‌ ఇంకా తెరపైకి రాకముందే మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం సుహానా న్యూయార్క్ లో తన న‌ట‌శిక్ష‌ణ‌ను పూర్తి చేస్తోంది. అక్కడ సమయం గడుపుతున్నప్పుడు తరచూ తన లైఫ్ స్టైల్ స్నీక్ పీక్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. క్ష‌ణాల్లో అవ‌న్నీ వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా సుహానా విహారయాత్ర నుండి అద్భుతమైన ఫోటోలను పంచుకుంది.

ఈ ఫోటోల్లో ఆమె టేబుల్ వద్ద కూర్చుని కనిపించింది. కొన్ని ఫోటోల్లో త‌న స్నేహితుల‌ను హ‌గ్ చేసుకుని క‌నిపించింది. వీటిలో బ్లూ శాటిన్ డిజైన‌ర్ డ్రెస్ లో సుహానా చాలా అందంగా క‌నిపిస్తోంది. అలాగే కొన్ని ఫోటోల‌లో ముదురు గోధుమ రంగు లిప్ స్టిక్ తో ఆకర్షణీయంగా క‌నిపించింది. త‌న‌ మెడలో ఓం లాకెట్ సహా 2 వేర్వేరు పెండెంట్లను ప‌రిశీలిస్తే అవి త‌న అందానికే వ‌న్నె తెచ్చాయి.

సుహానా న్యూయార్క్ బయలుదేరినప్పటి నుండి ఆమె కాలేజీలో తన జీవితాన్ని సోషల్ మీడియాలో ఇస్తోంది. లాక్ డౌన్ సమయంలో గత సంవత్సరం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ను పబ్లిక్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అప్పటి నుండి ఆమె ఫోటోలను పంచుకోవడానికి తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తోంది. అనన్య పాండే.. షానయ కపూర్ .. నవ్య న‌వేలితో సహా ఆమె సన్నిహితులతో ఆమె సోషల్ మీడియా సంభాషణలు తరచుగా అభిమానుల క్లబ్ ల‌లో వైరల్ అవుతాయి. ఇక సుహానా రాక కోసం సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. బాద్ షా షారూక్ లెగ‌సీని సుహానా ముందుకు తీసుకెళుతుంద‌నే భావిస్తున్నారు.