Begin typing your search above and press return to search.

సోకుల‌న్నీ చూపిస్తున్న చిన్న‌ది

By:  Tupaki Desk   |   27 March 2018 8:03 AM GMT
సోకుల‌న్నీ చూపిస్తున్న చిన్న‌ది
X
కింగ్ ఖాన్ షారుక్‌కు బాలీవుడ్‌లో ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో, ఆయ‌న గారాల ప‌ట్టీ సుహానా ఖాన్‌కు సోష‌ల్ మీడియాలో అంత‌కు మించిన పాపులారిటీ ఉంది. అమ్మ‌డు పెట్టే పోస్టుల‌కు వ‌చ్చే లైకులు - కామెంట్ల‌ను గ‌మ‌నిస్తే మ‌తి పోతుంది. ఆ క్రేజ్‌కు త‌గ్గ‌ట్టుగా హాట్ హాట్‌ గా ఫోటోలు పెడుతూ త‌న ఫాలోవ‌ర్స్‌ ను క‌వ్విస్తుంటుంది ఈ టీనేజ్ ముద్దుగుమ్మ‌.

తాజాగా బికినీ వేసి.. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఉన్న ఫోటోల‌ను త‌న ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్‌ లో షేర్ చేసింది సుహానా. ఈమెను త్వ‌ర‌లో సినిమాల్లోకి తీసుకురావాల‌ని భావిస్తున్నట్టుగా ఇప్ప‌టికే షారుక్‌ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ప్ర‌క‌టించింది. న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు కూడా చెప్పింది. అయితే ఈ పిల్ల వాల‌కం చూస్తుంటే, హీరోయిన్‌ కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ఒంట‌బ‌ట్టుకుని పుట్టిన‌ట్టుగా అనిపిస్తోంది. సినిమాల్లోకి రాక‌ముందే ఇంత‌లా రెచ్చిపోయి - అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటే - తెరంగ్రేటం చేశాక బాలీవుడ్‌ ని ఊపేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. క‌ళ్ల‌తో మాయ చేస్తూ, మ‌త్తులో ప‌డేయ‌డ‌మూ సోహానాకు బాగా తెలిసిన విద్య‌.

శ్రీ‌దేవి కూతురు జాన్వి కపూర్‌ - సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ ల‌కు కూడా సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. కానీ షారుక్ కూతురు మాత్రం వారి కంటే రెండాకులు ఎక్కువే చ‌దివింది. ఎందుకంటే ఇప్ప‌టికే సుహానాకి ఫ్యాన్ క్ల‌బ్ పేరిట చాలా అకౌంట్లు - సోష‌ల్ మీడియా గ్రూపులు ఉండ‌డం విశేషం. కింగ్ ఖాన్ కూతురా... మ‌జాకా!