Begin typing your search above and press return to search.

ఖాన్ కూతురి బూట్ల ఖరీదు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   13 April 2018 12:07 PM GMT
ఖాన్ కూతురి బూట్ల ఖరీదు ఎంతో తెలుసా?
X
రాజు గారు తలుచుకోవాలే గాని ఆయన దువ్వెన పళ్ళను కూడా బంగారంతో చేయిస్తారు అని పాత కథల్లో చదువుకోవడం సహజమే కాని బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మాత్రం అచ్చం అలాగే చేస్తోంది. ఇటీవల కోల్కతాలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ కు నాన్నతో కలిసి గ్రౌండ్ కు వచ్చిన సుహానా అందరి కళ్ళు తన మీదే ఉండేలా చేసుకుంది. స్లీవ్ లెస్ కూల్ జాకెట్ తో అక్కడక్కడ గతుకులు ఉన్న రిప్ద్ జీన్స్ వేసుకున్న సుహానా తాను వేసుకున్న షూస్ తో కూడా దృష్టి తనవైపు మళ్లేలా చేసుకుంది. ఎందుకంటారా. గైసప్పే జనోటి డిజైన్ చేసిన ఆ స్నీకర్స్ ఖరీదు అక్షరాల 65 వేల రూపాయల పైమాటే. అంటే నెలకు ఆరేడు వేలు జీతం తీసుకునే ఒక చిరుద్యోగి రెండు వందల రోజులు కష్టపడితే కాని అంత సొమ్ము రాదు. కాని సుహానా లాంటి స్టార్ కిడ్ కు ఆ లెక్కలు ఏమి అవసరం లేదు కాబట్టి నాన్న కూచి అడిగినంత కొనిచ్చేస్తున్నాడు షారుఖ్.

కూతురి తెరంగేట్రం గురించి షారుఖ్ కృత నిశ్చయంతోనే ఉన్నాడు. అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్-శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హాలతో ఇప్పటికే ఫాంలో ఉండగా వాళ్ళతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్-శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇలా ఎవరికి వారు బాలీవుడ్ లో జెండా పాతాలనే ప్లాన్ లో ఉన్నారు. తన కొడుకు తెరమీదకు రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు తన కూతురి రూపంలో వారసత్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని తహతహలాడుతున్నాడు షారుఖ్ ఖాన్. అందుకే వీలైనంత మేరకు తనను సోషల్ లైఫ్ లో ఉండేలా బయటికి తీసుకోస్తున్నాడు. గతంలో కూడా ఒక వేడుకలో 70 వేలు విలువ చేసే డిజైనర్ కాస్ట్యూమ్ ధరించిన సుహానా ఖాన్ ఇప్పుడు ఈడెన్ గార్డెన్ లో కూడా సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారడానికి కారణం ఇదే. మరి తన మొదటి సినిమాలో తనతో నటించి ఆడిపాడబోయే ఆ లక్కీ హీరో ఎవరో.