Begin typing your search above and press return to search.

స్టార్ డాటర్ ఎంట్రీకి గెట్ రెడీ!!

By:  Tupaki Desk   |   29 Aug 2017 4:05 AM GMT
స్టార్ డాటర్ ఎంట్రీకి  గెట్ రెడీ!!
X
అందమైన ముఖం.. ఆకట్టుకునే రూపం.. సినీ రంగంలో వారసత్వం... ఇవి చాలవా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడానికి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కూతురు సుహానా కు పై చెప్పిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు హీరోయిన్ గా రాణించాలన్న కోరిక కూడా ఉంది కాబట్టి బాలీవుడ్ ఆమెకు వెల్ కం చెప్పేందుకు సిద్ధంగానే ఉంటుంది.

తన కూతురు సుహానాకు నటనంటే ఆసక్తి అని షారూక్ యే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఆమెను యాక్టర్ గా చూడటం కంటే సంతోషం కలిగించేది మరేదీ ఉండబోదంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ఫ్యామిలీ వైపు నుంచి ఇబ్బందులు ఏవీ ఉండవనే గ్రీన్ సిగ్నల్ తో సుహానా సినిమాలపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. అల్లాటప్పాగా కాకుండా పర్ ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకున్నాకే సినిమాల్లోకి రావడాలని డిసైడైంది. దాంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఆఫీస్ కు వెళ్లడం మొదలెట్టింది. అక్కడున్న ప్రొఫెషనల్ హెయిర్ స్టయిలిస్టులు - మేకప్ నిపుణులు - టాప్ స్టయిలిస్టుల సూచనలతో తన స్టయిల్ కు అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో పడింది. ‘కెమెరా ముందు సుహానా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. అసలే మాత్రం తడబాటు లేదు. ఏదో బెదురుబెదురుగా కనిపించే టీనేజర్ లా కాకుండా ఒక పర్ ఫెక్ట్ యంగ్ లేడీలా అదరగొట్టింది’ అని ఆమె టాలెంట్ ప్రత్యక్షంగా చూసిన వాళ్లు చెప్పుకొస్తున్నారు.

సుహానా సినిమాల్లోకి అడుగు పెట్టడం ఖాయమే అయినా వెండితెరకు ఎప్పుడు పరిచయం చేయాలన్న దానిపై కరణ్ జోహార్ ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. ప్రస్తుతం కరణ్ జోహార్ నాటి బాలీవుడ్ నటుడు చుంకీపాండే కుమార్తె అనన్య పాండేను వెండితెరకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వంతు సుహానాదే కావచ్చు.