Begin typing your search above and press return to search.

మాస్ ఇమేజ్ కోసం సుధీర్ బాబు పాకులాట‌?

By:  Tupaki Desk   |   29 Jun 2021 6:30 AM GMT
మాస్ ఇమేజ్ కోసం సుధీర్ బాబు పాకులాట‌?
X
ఎన్ని క్లాస్ సినిమాల్లో న‌టించినా.. క్లాసీ న‌ట‌న‌తో మెప్పించినా కానీ.. టాలీవుడ్ లో బాక్సాఫీస్ వ‌ద్ద బాద్ షా అనిపించాలంటే హీరోకి మాస్ ఇమేజ్ త‌ప్పనిస‌రి. యూత్ తోపాటు మాస్ మెచ్చితేనే ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు రిపీట్ క‌లెక్ష‌న్లు వ‌స్తాయి. క్లాస్ ఆడియెన్ ఓటీటీల్లోనో లేదా డిజిట‌ల్లో చూస్తున్నారు. పైగా థియేట‌ర్ల‌కు వెళ్లేది త‌క్కువ‌.

అందుకే టాలీవుడ్ యువ‌హీరో సుధీర్ బాబు ఫోక‌స్ ప్ర‌స్తుతం మాస్ ఇమేజ్ పై నే ఫుల్ గా ఫోక‌స్ పెట్టార‌ట‌. మాస్ లో మ్యాసివ్ హిట్ కొట్టాల‌న్న‌ది అత‌డి పంతం. గోదారి నేప‌థ్యంలో రంగ‌స్థ‌లం త‌ర‌హాలో మాసీ సినిమా చేయ‌డం వెన‌క కార‌ణ‌మిదేన‌ని ఇన్ సైడ్ గుస‌గుసా వినిపిస్తోంది.

`శ్రీదేవి సోడాసెంట‌ర్` త‌న మాస్ ఇమేజ్ ని పెంచుతుంద‌నే అత‌డు భావిస్తున్నాడ‌ట‌. ఎలాగైనా ఈ సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టి తాను ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్న మాస్ ఇమేజ్ ద‌క్కించుకోవాల‌ని ట్రై చేస్తున్నాడు. గుబురు గ‌డ్డం కోర‌మీసం బాగా పెరిగిన జుత్తుతో సుధీర్ బాబు ర‌గ్ డ్ లుక్ ఇంత‌కుముందు రిలీజైన సంగ‌తి తెలిసిందే. దానికి అభిమానుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

ఈ మాస్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రానికి ప‌లాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఆనంది క‌థానాయిక‌. మణి శర్మ సంగీతం అందిస్తుండ‌గా సామ్ ‌దత్ సైనూదీన్ సినిమాటోగ్ర‌పీ అందిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా -శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ లాంటి టాప్ క్లాస్ ఎడిట‌ర్ వ‌ర్క్ చేస్తున్నారు. గోదారి నేప‌థ్యంలో మెజారిటీ సినిమా తెర‌కెక్కింది.

అయితే ఈ మాస్ సినిమాతో పాటే త‌నకు అచ్చొచ్చిన క్లాస్ సినిమా కూడా ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌తో సుధీర్ బాబు ప్లాన్ చేస్తున్నారు. వీ లో త‌న‌ని క్లాస్ గా చూపించిన మోహ‌న్ కృష్ణ మ‌రో క్లాసీ స్క్రిప్టును రెడీ చేస్తున్నార‌ట‌. ఏమైనా శ్రీదేవిసోడాసెంట‌ర్ సుధీర్ బాబుకి ఏ రేంజ్ లో క‌లిసి వ‌స్తుందో చూడాలి.