Begin typing your search above and press return to search.
`పలాస` దర్శకుడితో సుధీర్ బాబు ప్రయోగం
By: Tupaki Desk | 13 Sept 2020 12:00 PM ISTశ్రీకాకుళం బార్డర్ `పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించాడు కరుణ కుమార్. ఈ నవతరం దర్శకుడి సెన్సిబిలిటీస్ కి సృజనాత్మకతకు మంచి గుర్తింపు దక్కింది. విషయం ఉన్న దర్శకుడు అంటూ పొగిడేశారంతా. ఎంతో సహజసిద్ధమైన వాతావరణంలో అంతే చక్కని రాజకీయ నేపథ్యం ఉన్న కథతో బలహీన వర్గాలు అన్న పాయింట్ ని తెరపై చెప్పిన తీరు బావుంది. కర్కశమైన పలాస పగప్రతీకారాల్ని హత్యారాజకీయాల్ని ఎంతో ఒడుపుగా చూపించాడు మనోడు అని ముచ్చటించుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇంకా చక్కని ఆదరణ పొందుతోంది.
అందుకే ఇప్పుడు ఈ డైరెక్టర్ తో సుధీర్ బాబు కలుస్తున్నాడు అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది. కరుణ కుమార్ ఇప్పటికే ఓటీటీలో `మెట్రో కథలు` అనే వెబ్ మూవీని ప్రయత్నించారు. తిరిగి సినిమా బాటకు వచ్చేందుకు అతడు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే కరుణ కుమార్ సుధీర్ బాబుకు ఆకట్టుకునే కథను వివరించారని హీరో ఓకే చెప్పాడని తెలిసింది. ఈ చిత్రం ఒక చిన్న టౌన్ పరిసరాలలో సాగే ఘాఢమైన ప్రేమకథతో తెరకెక్కనుందట.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో సుధీర్ బాబు పాత్ర కొత్తగా ఉంటుందని సరికొత్త యాసను మాట్లాడతాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త రూపంతో సుధీర్ కనిపిస్తాడట. ఇక సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించాల్సి ఉండగా అది జనవరిలో ప్రారంభమవుతుందని కూడా తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారా లేక ఇంకెవరైనానా? అన్నది తేలాల్సి ఉంది. ఈలోగానే పలాస దర్శకుడితో కొత్త మూవీని స్టార్ట్ చేస్తారట. నానీతో కలిసి నటించిన `వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు రాగా సుధీర్ బాబు కాప్ రోల్ కి పేరొచ్చింది.