Begin typing your search above and press return to search.

మళ్లీ కొత్త కాన్సెప్ట్ పట్టిన నిఖిల్

By:  Tupaki Desk   |   15 March 2017 5:41 PM GMT
మళ్లీ కొత్త కాన్సెప్ట్ పట్టిన నిఖిల్
X
యంగ్ హీరో నిఖిల్ సినిమా అంటే.. ఏదో ఒకటి డిఫరెంట్ గా చూపించేస్తాడనే పేరు తెచ్చేసుకున్నాడు. స్వామిరారా.. సూర్య వర్సెస్ సూర్య.. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. ఇలా ప్రతీ సినిమాకి ఏదో ఒక వెరైటీ పాయింట్ చూపిస్తున్న నిఖిల్.. తన కొత్త సినిమా కేశవలో కూడా డిఫరెండ్ కాన్సెప్ట్ ను పరిచయం చేయబోతున్నాడు. కేశవ చిత్రాన్ని రివెంట్ డ్రామా అని ఇప్పటికే చెప్పేశాడు దర్శకుడు సుధీర్ వర్మ.

అయితే.. హీరో కేరక్టర్ లోనే విభిన్నమైన ఎలిమెంట్ ను మిక్స్ చేశాడట. ఈ మూవీలో హీరో కేరక్టర్ ఏ మాత్రం ఆవేశ పడే అవకాశం ఉండదని తెలుస్తోంది. అంటే.. ఏ కొంచెం ఎక్కువ ఎమోషన్ ఫీలయినా సరే.. హీరో గుండె ఆగిపోయి చనిపోతాడట. అందుకనే పగ తీర్చుకోవడంలో కూడా చాలా కూల్ గా వ్యవహరించాల్సి ఉంటుందట నిఖిల్. అంటే కంప్లీట్ గా సటిల్డ్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుందట. కేశవ చిత్రానికి ఈ పాయింట్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో విభిన్నంగా ప్రయత్నించాడనే టాక్ ఉంది. సహజంగా రివెంజ్ డ్రామాలు అన్నీ ఒకటే కోణంలో సాగుతూ ఉంటాయి. కానీ.. కేశవ ఆ టైపులో ఉండదని.. రొటీన్ సినిమాలకు భిన్నంగా.. స్క్రీన్ పై కనిపించే ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా.. స్టోరీలో భాగంగా ఉండేలా తీర్చిదిద్దాడట దర్శకుడు సుధీర్ వర్మ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/