Begin typing your search above and press return to search.

స్వామిని మళ్లీ రమ్మంటున్న నిఖిల్

By:  Tupaki Desk   |   23 Jun 2016 4:41 PM GMT
స్వామిని మళ్లీ రమ్మంటున్న నిఖిల్
X
మూడేళ్ల క్రితం స్వామిరారా చిత్రం టాలీవుడ్ సంచలనాలు నమోదు చేసింది. నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లు సుధీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రైమ్ కామెడీకి.. ఆడియన్స్ నుంచి విపరీతమైన మద్దతు లభించింది. దొంగతనాలను కాన్సెప్ట్ గా చూపించి.. బాగానే వసూళ్లను పట్టేసింది స్వామి రారా. ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో.. టాప్ హిట్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పుడు నిఖిల్, సుధీర్ వర్మలు మరోసారి జత కట్టనున్నారనే న్యూస్.. ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

సుధీర్ వర్మ గత కొంతకాలంగా రవితేజతో ఓ సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. స్టోరీ విషయంలో మాస్ మహరాజ్ సరే అన్నాడనే తప్ప.. ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియడం లేదు. దీంతో మరోసారి నిఖిల్ తోనే సినిమా చేసేందుకు మరో స్టోరీ సిద్ధం చేసుకున్న సుధీర్ వర్మ.. కొత్త లైన్ ని నిఖిల్ కి చెప్పాడు. యంగ్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పూర్తి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డాడు నిఖిల్.

ప్రస్తుతం నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీని ఫినిషింగ్ దశకు తీసుకొస్తున్నాడు. ఇది పూర్తి కాగానే సుధీర్ వర్మ సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే.. హీరోయిన్ విషయంలో క్లారిటీ లేదు కానీ.. టెక్నికల్ టీం మొత్తాన్ని స్వామి రారా యూనిట్ నే రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది.