Begin typing your search above and press return to search.

నొప్పించక తానొవ్వక.. తప్పించుకున్న సుధీర్..!

By:  Tupaki Desk   |   23 Nov 2022 5:30 PM GMT
నొప్పించక తానొవ్వక.. తప్పించుకున్న సుధీర్..!
X
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో తో పాపులర్ అయ్యి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అతను ఇప్పుడు హీరోగా మారి హిట్ అందుకున్నాడు. తనను తాను ఎప్పుడూ హీరో మెటీరియల్ అని ప్రమోట్ చేసుకునే సుధీర్ జబర్దస్త్ క్రేజ్ తో సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేశాడు. జబర్దస్త్ లోని స్కిట్స్ నే ముక్కలుగా చేసి ఆ సినిమా అతికించినట్లు ఉండగా సినిమా వచ్చింది వెళ్లింది కూడా ఎవరికీ తెలియలేదు. ఇక రెండో ప్రయత్నంగా త్రీ మంకీస్ చేసినా లాభం లేకుండా పోయింది. సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కలిసి నటించిన ఈ సినిమా కూడా నిరాశపరచింది.

ఇక రీసెంట్ గా వాంటెడ్ పండుగాడ్ మూవీ కూడా చేశాడు సుధీర్ అయితే అది సోలో సినిమా కాదు. సునీల్ కూడా నటించారు. శ్రీధర్ సీపాన డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా పెద్దగా అలరించలేదు. ఫైనల్ గా సుధీర్ గాలోడు అంటూ వచ్చి హిట్ కొట్టాడు. సుధీర్ లోని టాలెంట్ అంతా కూడా ఈ సినిమాలో వాడేశారు. సినిమాను రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ సుధీర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. సుధీర్ సరసన గయానా ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో సుధీర్ ని యాంకర్ ఓ సరదా ప్రశ్న అడిగింది. అదేంటి అంటే రష్మి, ధన్యా బాలకృష్ణ, గయనా ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఎవరితో డేట్ చేస్తారు అని అడిగింది. సుధీర్ ఈ ప్రశ్నకు ముగ్గురితో డిన్నర్ కి వెళ్తానని.. ముగ్గురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం కష్టమని అన్నాడు. ఒకవేళ ఒక్కరినే కచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ల ముగ్గురిని ఎంజాయ్ చేయమని తాను వెళ్లిపోతానని అన్నాడు సుధీర్. యాంకర్ ఏదో సరదాగా అడిగిన ఈ ప్రశ్నకి కూడా నొప్పించక తానొవ్వక అన్న సుమతి శతకం లాగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు సుధీర్.

బుల్లితెర మీద నుంచి వెండితెర మీదకు వెళ్లిన సుధీర్ హీరోగా మొదటి ఖాతా తెరిచాడు. అయితే రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కథలతో సుధీర్ ప్రయోగాలు చేయాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ కి ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. ఆ ధైర్యంతోనే అతను సోలో హీరోగా సత్తా చాటాలని చూస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.