Begin typing your search above and press return to search.
REST అన్నదే నచ్చదన్న జిమ్మింగ్ హీరో
By: Tupaki Desk | 18 July 2020 10:45 AM ISTబిజీ లైఫ్ లో రెస్ట్ లేదన్నది చాలా మంది వినిపించే కంప్లైంట్. కానీ ఆ హీరో తీరు మాత్రం వేరుగా ఉంది. అసలు రెస్ట్ అన్న పదమే యావరేజ్ అనేశాడు. అదో `మెడికోర్ వర్డ్`.. అంటూ తీసిపారేశాడు. అంతేకాదు.. తనకు రెస్ట్ అన్న పదానికే మీనింగ్ తెలీదన్న తీరుగా ఇదిగో ఇలా రెస్ట్ లెస్ గా జిమ్మింగ్ తో శ్రమిస్తున్న వీడియోల్ని షేర్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ చేశాడు. ఇంతకీ ఎవరీ హీరో? అంటే ఇంకెవరు.. ఘట్టమనేని వారి అల్లుడు .. హీరో సుధీర్ బాబు.
సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడే అయినా.. సూపర్ హీరో మహేష్ కి బావే అయినా కానీ ఏనాడూ ఆ సెలబ్రిటీ హోదాని చూపించేందుకు పెద్దగా ఆసక్తిని కనబరచనివాడిగా సుధీర్ బాబు గురించి పరిశ్రమలో టాక్ ఉంది. డౌన్ టు ఎర్త్ నేచుర్ అతడికి ఆభరణం. ఇక అతడి హార్డ్ వర్కింగ్ నేచుర్ మొదటి సినిమాతోనే బయటపడింది. ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా రాకపోయినా తన ప్రయత్నం మాత్రం ఏనాడూ మానుకోలేదు. బావ మహేష్ సలహాలు తీసుకుని మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇటీవల అతడి లుక్ అమాంతం మారింది. హీరోయిక్ అప్పియరెన్స్ పెరిగింది. అలాగే తెరపై సన్నివేశంలో వినిపించే టోన్ (వాయిస్) కూడా మారింది. ప్రస్తుతం అతడు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి ప్రస్తుతం `వీ` లాంటి ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలుకా పిల్లి ఆట తరహా దొంగా పోలీస్ డ్రామాలో సుధీర్ బాబు కాప్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే అతడి పాత్రలో మరో ట్విస్టు థియేటర్లో ఆడియెన్ కి ఊపిరాడనివ్వదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగులు లేవు కాబట్టి ఈ క్వారంటైన్ సమయంలో ఇదిగో ఇలా హెవీ వెయిట్స్ తో జిమ్మింగ్ చేస్తూ తన వెయిట్ తగ్గించుకుంటున్నాడు. పనిలో పనిగా కండలు మెలి తిరిగిన దేహాన్ని తీర్చిదిద్దుతున్నాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి