Begin typing your search above and press return to search.

`ల‌వ్ స్టోరి` మేక‌ర్స్ తో సుధీర్ బాబు రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్!

By:  Tupaki Desk   |   12 July 2021 4:04 AM GMT
`ల‌వ్ స్టోరి` మేక‌ర్స్ తో సుధీర్ బాబు రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్!
X
క‌రోనా క్రైసిస్ తో ప‌ని లేకుండా వ‌రుస‌గా సినిమాలకు ముహూర్తాలు చేస్తున్నారు. నాగ చైతన్య `లవ్ స్టోరి`ని నిర్మిస్తున్న‌ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి .. ధనుష్ చిత్రం సహా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. డే బై డే ఈ సంస్థ‌ ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. మీడియం రేంజ్ నుండి పెద్ద‌ బడ్జెట్ సినిమాల‌కు ప్లాన్ చేస్తోంది. వ‌రుస‌గా జ‌న‌రేష‌న్ హీరోల‌తో సినిమాలు చేసేందుకు నారంగ్ బృందం ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

తాజాగా సుధీర్ బాబు హీరోగా హర్ష వర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ ప్ర‌క‌టించింది. సుధీర్ బాబు- హర్ష వర్ధన్- శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్ నెం 5 షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది.

ప్ర‌స్తుతం హీరో సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. మా సంస్థ‌లో ఐదో సినిమాకి సంతకం చేశారని నిర్మాత‌లు తెలిపారు. సోనాలి నారంగ్ -శ్రీష్టి సమర్పణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) బ్యాన‌ర్ లో నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాపుల‌ర్ నటుడు రచయిత హర్ష వర్ధన్ ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెర‌కెక్కిస్తారు. మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. సుధీర్ బాబు ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటితో ఓ మూవీ చేస్తున్నారు. శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ రిలీజ్ కి రావాల్సి ఉంది.