Begin typing your search above and press return to search.

మహేష్ కి విలన్ గా బావ రెడీ

By:  Tupaki Desk   |   9 July 2017 9:03 AM GMT
మహేష్ కి విలన్ గా బావ రెడీ
X

మహేష్ బాబుకి బావ అనే ట్యాగ్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలీవుడ్ మూవీ బాఘిలో విలన్ గా నటించి మెప్పించి.. స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూ.. మరో వైపు విలన్ పాత్రలకు కూడా రెడీ అంటున్న సుధీర్ బాబు.. ఇప్పుడు శమంతకమణి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దర్శకుడు శ్రీరాం ఆదిత్యతో భలే మంచి రోజు సినిమా చేశాడు సుధీర్ బాబు. ఆ సమయంలో ఏర్పడ్డ అనుబంధం కారణంగా.. మల్టీస్టారర్ కథలో నటించే ఉద్దేశ్యం లేకపోయినా.. కథ విన్నాడట. ఈ సినిమాతో తెలుగు సినిమాకు కొత్త జోనర్ పరిచయం అవుతుందని అర్ధం కావడంతో.. ఏ పాత్ర అయినా చేసేందుకు రెడీ అని చెప్పాడట సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు చేస్తున్న పాత్ర పేరు కృష్ణ కావడం విశేషం. దర్శకుడు చెప్పిన మేరకే కృష్ణ రోల్ లో చేస్తున్నట్లు చెప్పాడు మహేష్ బాబు బావ.

ఇక బాఘీ తర్వాత విలన్ గా చాలానే అవకాశాలు వచ్చినా.. ఆ కేరక్టర్స్ నచ్చకపోవడంతోనే చేయలేదంటున్న ఈ హీరో.. అవకాశం వస్తే మహేష్ బాబు సినిమాలో విలన్ గా నటించేందుకు రెడీ అంటున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ తో కలిసి వీరభోగ వసంతరాయలు అనే చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలోను.. తనే హీరోగా రాజా దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీని.. పుల్లెల గోపీచంద్ జీవితంపై రూపొందనున్న బయోపిక్ లోను నటిస్తున్నట్లు సుధీర్ బాబు చెబుతున్నాడు.