Begin typing your search above and press return to search.

చ‌ల్తీ కా నామ్ పాట‌కి అంత విశేష‌మా?!

By:  Tupaki Desk   |   20 Dec 2015 1:30 PM GMT
చ‌ల్తీ కా నామ్ పాట‌కి అంత విశేష‌మా?!
X
మ‌హేష్ బావ సుధీర్‌ బాబు చాలా సినిమాలే చేశాడు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కూడా మాస్ మ‌సాలా క‌థ‌ల‌తో సినిమాలు చేశాడు. వాట‌న్నిటిపైనా మంచి అంచ‌నాలే క‌నిపించేవి. అయితే `భ‌లే మంచి రోజు`కి వ‌చ్చినంత హైప్‌ మాత్రం ఇప్ప‌టిదాకా ఏ సినిమాకీ రాలేద‌నే చెప్పాలి. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ అయిన శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో భ‌లే మంచి రోజు తెర‌కెక్కింది. కార‌ణాలేంటో తెలీదు కానీ... ఈ సినిమాకి మంచి హైప్ వ‌చ్చింది. కొబ్బ‌రికాయ కొట్టింది మొద‌లు ఈ సినిమా గురించి ప‌రిశ్ర‌మ జ‌నాలు ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దానికితోడు మ‌హేష్ బాబు ఆడియో వేడుక‌లో పాల్గొన‌డం, ఈ సినిమాతో సుధీర్ స్టార్ అయిపోవ‌చ్చు అని చెప్ప‌డం.... ఆ తర్వాత ప్ర‌భాస్ కూడా ఈ సినిమా గురించి బాగా మాట్లాడ‌టంలాంటి కార‌ణాల‌తో భ‌లే మంచి రోజు గురించి ఇంకా ఎక్కువ‌గా జ‌నాలు మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. వ‌చ్చే శుక్ర‌వారమే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఒక్క రోజు వ్య‌వ‌ధిలో జ‌రిగే ఈ క‌థ‌లో చాలా విశేషాలే ఉన్నాయ‌ని ఇండ‌స్ట్రీ ఇన్‌ సైడ్ టాక్‌. తాజాగా క‌థానాయ‌కుడు సుధీర్‌ బాబు స్వ‌యంగా ఓ విశేషాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఈ సినిమాలో చ‌ల్తీకానామ్ గాడీ... అంటూ ఓ పాట సాగుతుంద‌ట‌. అందులో 90శాతం రియ‌ల్ వ్య‌క్తులు - రియ‌ల్ లొకేష‌న్ల నేప‌థ్యంలో తీసిందేన‌ట‌. ఆ పాట‌ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు, ఎదురుగా కెమెరా ఉన్న‌ట్టు జ‌నాల‌కి కూడా తెలియ‌దట‌. ఆ పాట సినిమాకి హైలెట్ అవుతుంద‌ని సుధీర్ చెబుతున్నాడు. ఇందులో ఆయ‌న చేసిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు, ఆయ‌న చేసిన కామెడీ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. సుధీర్ స‌ర‌స‌న వామికా గ‌బ్బి న‌టించింది.