Begin typing your search above and press return to search.

సుధీర్ సినిమా రేంజే వేరులా ఉందే

By:  Tupaki Desk   |   19 Dec 2015 1:30 PM GMT
సుధీర్ సినిమా రేంజే వేరులా ఉందే
X
చివరికి క్రిస్మస్ రేసులో నాలుగు సినిమాలు నిలిచాయి. ఈ నాలుగూ కూడా ఆసక్తి రేపుతున్నవే.. రిజల్ట్ మీద కాన్ఫిడెంటుగా ఉన్నవే. అన్నింట్లోకి వైవిధ్యంగా కనిపిస్తున్న సినిమా మాత్రం ‘భలే మంచి రోజు’నే అని చెప్పాలి. దీని టీజర్, ట్రైలర్ చాలా డిఫరెంటుగా ఉండి సినిమా మీద బాగా ఆసక్తి రేపాయి. మహేష్ బాబుతో ఆడియో లాంచ్ చేయించడం.. ప్రభాస్‌ తోనూ సినిమాను ప్రమోట్ చేయించడం ద్వారా జనాల్లో మరింతగా ఆసక్తి పెరిగేలా చేయగలిగింది ‘భలే మంచి రోజు’ యూనిట్.

‘భలే మంచి రోజు’కు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దీన్ని దాల్బీ అట్మాస్ సౌండ్ లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి - శ్రీమంతుడు - కిక్-2 లాంటి బడా సినిమాలకు మాత్రమే ఈ సౌండ్ టెక్నాలజీ వినియోగించారు. చిన్న సినిమాల వరకు చూస్తే ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ ఉపయోగిస్తోంది ‘భలే మంచి రోజు’కే. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో తీసిన సినిమా కావడంతో ఈ అదనపు ఆకర్షణ కూడా జోడించారు.

ఈ చిత్రానికి ‘విశ్వరూపం’కు పని చేసిన శ్యామ్ దత్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఛాయాగ్రహణం అందించగా.. సన్నీ ఎం.ఆర్. సంగీతాన్నందించాడు. మిగతా సాంకేతిక నిపుణులు కూడా పేరున్నవారే. మొత్తానికి వ్యవహారం చూస్తుంటే ‘భలే మంచి రోజు’ రేంజే వేరన్నట్లు కనిపిస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే సుధీర్ బాబు కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతోనే అందుకునే అవకాశముంది.