Begin typing your search above and press return to search.

'ఆ అమ్మాయి..' ఫస్ట్ లుక్: సుధీర్ తో రొమాంటిక్ మూడ్ లో కృతి శెట్టి..!

By:  Tupaki Desk   |   1 Jan 2022 4:30 PM GMT
ఆ అమ్మాయి.. ఫస్ట్ లుక్: సుధీర్ తో రొమాంటిక్ మూడ్ లో కృతి శెట్టి..!
X
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''. ఇందులో సుధీర్ సరసన యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్.. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు.

'ఆ అమ్మాయి..' ఫస్ట్ లుక్ పోస్టర్ లో లీడ్ పెయిర్ సుధీర్ బాబు - కృతి శెట్టి రొమాంటిక్ మూడ్ లో ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఉప్పెన భామ మెడ మీద సుధీర్ బాబు ముద్దు పెట్టుకుంటుండగా.., కృతి దానికి ఓకే చెప్పిందనడానికి గుర్తుగా కళ్ళు మూసుకొని ఉంది. సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. అలానే సుధీర్ - కృతి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే విషయాన్ని తెలియజేస్తుంది.

'ఉప్పెన' 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి బోల్డ్ సీన్స్ లో నిరభ్యంతరంగా నటించింది. ఇప్పుడు ''ఆ అమ్మాయి..'' కోసం చిత్రంలో కూడా సుధీర్ బాబుతో కృతి రొమాంటిక్ సన్నివేశాలు చేసినట్లు అర్థం అవుతోంది. అందమైన ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించే ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. ఇప్పుడు అద్భుతమైన ప్రేమకథతో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్‌ మార్క్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని బి మహేంద్రబాబు - కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. పి జి విందా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.

''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' చిత్రంలో అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ - కళ్యాణి నటరాజన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'సమ్మోహనం' 'వి' తర్వాత సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో వస్తోన్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.