Begin typing your search above and press return to search.

టాలీవుడ్ యువహీరో.. కోవిడ్ ఫస్ట్ డోస్ కంప్లీట్!

By:  Tupaki Desk   |   2 Jun 2021 9:31 AM GMT
టాలీవుడ్ యువహీరో.. కోవిడ్ ఫస్ట్ డోస్ కంప్లీట్!
X
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రజలను మరిన్ని అవస్థలకు గురి చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సామాన్యులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మహమ్మారి పరిస్థితి ఇంతకుముందులా లేదు. అందుకనే దేశంలో ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తీసుకోవాలని కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ప్రభుత్వం సూచన మేరకు దేశవ్యాప్తంగా అందరూ మొదటి డోస్ రెండవ డోస్ వాక్సిన్ లను వేసుకుంటున్నారు.

అందులో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా వాక్సిన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హీరో సుధీర్ బాబు కూడా తన ఫస్ట్ డోస్ వాక్సిన్ తీసుకున్నాడు. తాను వాక్సిన్ వేయించుకుంటున్న ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అలాగే తాను వాక్సిన్ వేయించుకున్నానని.. ఫ్యాన్స్ అందరూ త్వరగా వాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. ఇదిలా ఉండగా.. తెలుగు ఇండస్ట్రీలో మెల్లమెల్లగా డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ హీరోగా సెటిల్ అవుతున్నాడు సుధీర్ బాబు. గతేడాది వి అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రస్తుతం సుధీర్ ప్రధానపాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా చేస్తున్నాడు. పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సూరిబాబు అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన శ్రీదేవి సోడా సెంటర్ గ్లింప్స్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఆ వీడియోలో సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను ఫిదా చేసాడని చెప్పాలి. సుధీర్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. ఎల్లప్పుడూ వర్కౌట్స్ తో సినిమాలకు కావాల్సిన విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు వాక్సిన్ వేయించుకున్న ఫోటోలో కూడా సుధీర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమా అనంతరం సుధీర్ మరోసారి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేయనున్నాడు.