Begin typing your search above and press return to search.

150 పూర్తయ్యాక వినాయక్ అదేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2016 4:14 AM GMT
150 పూర్తయ్యాక వినాయక్ అదేనా?
X
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా కోలీవుడ్ మూవీ కత్తి రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నాడు వివి వినాయక్. ఈ విషయం ఇప్పటికే ఫిక్స్ అయింది. నిర్మాత రామ్ చరణ్ కూడా అనుమానాలు అవసరం లేదని, వినాయక్ డైరెక్షన్ లోనే రూపొందుతుందని ఇప్పటికే చెప్పేశాడు.

అసలు ఈ అనుమానం రావడానికి కారణం హీరో నితిన్ నిర్మాతగా, వినాయక్ డైరెక్షన్ లో రూపొందిన అఖిల్ ఫ్లాప్ కావడమే. ఇప్పుడు నితిన్ ఫాదర్ సుధారక్ రెడ్డి - వినాయక్ లు జంటగా కనిపించడం కొత్త చర్చకు దారి తీసింది. బెల్లంకొండ సురేష్ హీరోగా నటిస్తున్న స్పీడున్నోడు సెట్స్ కు కలిసొచ్చారు సుధాకర్ రెడ్డి - వినాయక్. ఇద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం కనిపించింది. తర్వాత ప్రాజెక్ట్ విషయంలోనే వీరిద్దరూ ఇలా చర్చించుకున్నారని అంటున్నారు ఇదంతా గమనించిన వాళ్లు.

అఖిల్ విషయంలో నితిన్ ఫ్యామిలీకి భారీ లాస్ వచ్చిన మాట వాస్తవమే. దీన్ని పూడ్చేందుకు ఏం చేయాలని డిస్కస్ చేశారట. చిరంజీవితో 150వ సినిమా పూర్తి కాగానే.. నితిన్ తో వినాయక్ ఓ మూవీ చేసే అవకాశాలున్నాయని ఇప్పుడు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే సుధాకర్ రెడ్డి, వినాయక్ ల మధ్య చర్చలు జరిగాయంటున్నారు. నితిన్ ని సూపర్ స్టార్ చేసిన దిల్ మూవీని డైరెక్ట్ చేసినది వినాయక్కే. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న నితిన్, త్వరలో మరో స్టార్ డైరెక్టర్ వినాయక్ తో కూడా జత కట్టే అవకాశాలున్నాయన్నది లేటెస్ట్ టాక్.