Begin typing your search above and press return to search.

కమ్ముల కుర్రాడు.. ఇప్పుడైనా కొడతాడా?

By:  Tupaki Desk   |   7 March 2018 8:00 AM IST
కమ్ముల కుర్రాడు.. ఇప్పుడైనా కొడతాడా?
X
ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఇప్పుడు ఫిదా అంటూ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న ఈ దర్శకుడు.. గతంలో హ్యాపీడేస్ మూవీ సెన్సేషన్ సృష్టించాడు. ఆ చిత్రం ద్వారా వరుణ్ సందేష్.. నిఖిల్.. తమన్నా విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

మళ్లీ ఇదే తరహాగా తీసిన మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఐదున్నరేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి అంతగా ఆదరణ దక్కకపోవడంతో.. ఆ మూవీలో నటించిన యాక్టర్స్ కు.. హ్యాపీడేస్ మాదిరిగా అడ్వాంటేజ్ రాలేదు. వీరిలో సుధాకర్ కొమకుల కూడా ఒకడు. ఉందిలే మంచి కాలం ముందుముందునా.. కుందనపు బొమ్మ వంటి చిత్రాలలో నటించినా.. ఇతడు సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ఇప్పుడు కుర్రాడు 'నువ్వు తోపురా'అనే మూవీతో ఆఢియన్స్ ముందుకు వస్తున్నాడు. హరిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తనకు బ్రేక్ ఇచ్చే మూవీగా నువ్వు తోపురా నిలుస్తుందని ఆశలు పెట్టుకున్నాడు సుధాకర్. నిత్యా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ స్క్రిప్ట్ పై దర్శకుడితో కలిసి తాను సుదీర్ఘకాలం వర్క్ చేశానని అంటున్నాడు సుధాకర్. షూటింగ్ ప్రారంభానికి ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. తాను చేసిన పాత్ర.. ప్రతీ కుర్రాడు తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుందని చెబుతున్నాడు ఈ కుర్ర హీరో. గత తరం హీరోయిన్ నిరోషా ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది.