Begin typing your search above and press return to search.

ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్ అంతే!!

By:  Tupaki Desk   |   5 April 2017 4:11 AM GMT
ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్ అంతే!!
X
ఇప్పుడు ''గురు'' టీమ్ అంతా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సినిమా కమర్షియల్స్ పక్కనెట్టేస్తే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చాలా హ్యాపీగా ఉందంటున్నారు. నిన్న సాయంత్రం జరిగిన సినిమా ప్రెస్ మీట్ లో ఇటు హీరో వెంకటేష్‌.. అటు దర్శకురాలు సుధ కొంగరలు.. ఇటువంటి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పెద్ద దండం అంటూ చెప్పారు.

''ఒక కొత్త సినిమా చేసినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను కోరుకున్నారు కాబట్టే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. ఇదొక గుడ్ సినిమా అని తీశాం.. ఆడియన్స్ కు కూడా నచ్చినందుకు ఆనందంగా ఉంది. దర్శకురాలు సుధ ఈ సినిమా నా దగ్గరకు తీసుకురావడం నా అదృష్టం. ఎన్నో సినిమాలు చేశాను ఎన్నో అవార్డులు వచ్చాయి కాని.. ఈ సినిమాలో చేసిన క్యారక్టర్ బాగా నచ్చింది. నా సినిమాలన్నీ ఒకలే ఉంటున్నాయి అనే ఫీలింగ్ వచ్చిన టైములో ఈ సినిమా నాకు రావడం నా అదృష్టం'' అని తన ఆనందాన్ని పంచుకున్నాడు విక్టరీ వెంకటేష్‌.

''ప్రపంచంలోనే 3వ కష్టమైన జాబ్ ఏంటంటే.. అది సినిమా తీయడమే. చాలాసార్లు నిద్రలేచి ఈ సినిమాలు నీకు అవసరమా అనుకున్నా. కాని కొన్ని రోజులు కుంటుతూ.. కొన్ని రోజులు పరిగెడుతూ.. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను కృతజ్ఞాత చూపించాల్సిన సమయం. మీడియాకు.. నా ప్రొడ్యూసర్ కు.. హీరో వెంకటేష్ గారికి.. రితికా కు.. ముంతాజ్ కు.. నా కృతజ్ఞతలు. వీరందరి వలనా నేను ఒక మంచి ఫీలింగ్ ఉండే సినిమాను తీయగలిగాను'' అంటూ సెలవిచ్చంది దర్శకురాలు సుధ కొంగర.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/