Begin typing your search above and press return to search.
అగ్ర బ్యానర్ కి నో చెప్పిన క్రేజీ లేడీ డైరెక్టర్!
By: Tupaki Desk | 9 Dec 2020 6:00 AM ISTస్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ చిత్రంగా నిలిచింది. ప్రయోగాత్మక కంటెంట్ తో సున్నిత భావోద్వేగాలను పెద్ద తెరపైకి అద్భుతంగా తేగలిగిన దర్శకురాలిగా సుధ కొంగర పేరు మార్మోగింది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కించిన గురు సినిమాతోనే సుధ సత్తా ఏంటో తెలిసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో సుధ కొంగర విమర్శకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా బయోపిక్ కేటగిరీలో గొప్ప ప్రజాదరణ పొందింది.
ప్రస్తుతం సుధ కొంగర తెలుగు - తమిళ పరిశ్రమల్లో వరుస ఆఫర్లతో బిజీ డైరెక్టర్ గా మారారు. ఇప్పటికీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అదే క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా సుధా కొంగరను సంప్రదించి వారి బ్యానర్ లో సినిమా చేయడానికి ఫాన్సీ ఆఫర్ ఇచ్చారట. అయితే ఈ ఆఫర్ ని దర్శకురాలు సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.
అంత పెద్ద అవకాశాన్ని తిరస్కరించడానికి కారణం ఇప్పటికే లైకా సంస్థకు కమిటవ్వడమేనని తెలిసింది. దాంతో పాటే పలు ప్రాజెక్టులతో సుధ బిజీగా ఉన్నారు. అవన్నీ పూర్తయితే కానీ కమిట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉందట. సుధ తదుపరి చిత్రం సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ `రతన్ టాటా జీవితం` ఆధారంగా రూపొందనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆర్.మాధవన్ ఈ చిత్రంలో రతన్ టాటా పాత్రను పోషించనున్నారట. అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటించాల్సి ఉంటుంది.