Begin typing your search above and press return to search.

గురు సీక్వెల్ లో దగ్గుబాటి హీరో

By:  Tupaki Desk   |   6 April 2017 5:07 AM GMT
గురు సీక్వెల్ లో దగ్గుబాటి హీరో
X
గత వారం రిలీజ్ అయిన వెంకటేష్ గురు మూవీ.. మంచి విజయాన్నే అందుకుంది. బాక్సింగ్ గురవుగా వెంకటేష్ నటనకు మంచి ప్రశంసలతో పాటు.. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. యూఎస్ ఆడియన్స్ నుంచి గురుకు ఆదరణ అస్సలు లభించకపోయినా.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాత్రం మంచి విజయాన్నే కట్టబెట్టారు.

తమిళ్ రీమేక్ సినిమా అయినా.. యథాతథంగా తీసినా.. గురు విషయంలో ఫ్రెష్ ఫీలింగ్ కలుగజేయడంలో దర్శకురాలు సుధ కొంగర సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడీ గురుకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఈ డైరెక్టర్ కు ఉందట. ఇప్పటికే వెంకటేష్.. సురేష్ బాబు స్టోరీలైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సీక్వెల్ లో గురు పాత్రలో నటించేది వెంకటేష్ కాదు. ఈ సీక్వెల్ కథను దగ్గుబాటి రానాతో చేయాలని ఈ డైరెక్టర్ ఉద్దేశ్యం.

వెంకీ.. రానా కేరక్టర్లను లింక్ చేస్తూ ఈమె చెప్పిన పాయింట్ ఈ సీక్వెల్ కి హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. అయితే.. దీనికి ఇంకా సురేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం స్టోరీ లైన్ తో పాటు.. స్క్రిప్ట్ పై కొంత వర్క్ చేసిన సుధ కొంగర.. వెంకీ అండ్ టీం నుంచి కన్ఫర్మేషన్ వచ్చాక.. ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/