Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ తెలుగు ఈసారి ఎవ‌రు ఔట్?

By:  Tupaki Desk   |   16 Oct 2022 5:12 AM GMT
బిగ్ బాస్ తెలుగు ఈసారి ఎవ‌రు ఔట్?
X
బిగ్ బాస్ తెలుగు అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఆరో వారానికి చేరుకుంది. అయితే ఈ షోలో బలమైన కంటెస్టెంట్ గా కనిపించిన సుదీప తన గేమ్‌తో పలుమార్లు విఫలమై హౌస్ కి దూరంగా ఉంది. ఆరో వారంలో సుదీపనే ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపేసార‌ని సమాచారం. ఆదిరెడ్డి- బాలాదిత్య- సుదీప రాపర్తి- కీర్తి భట్- మెరీనా అబ్రహం- గీతూ రాయల్- రాజశేఖర్- శ్రీహన్- శ్రీ సత్య నామినేషన్స్ లో ఉన్నారు.

వీరిలో సుదీప- బాలాదిత్యలు చివరి దశ వరకు వెళ్లగా వీరిద్దరి మధ్య ఎలిమినేషన్‌ జరుగుతుందని భావించిన హౌస్‌ అంతా షాక్ కు గురైంది. చివరికి సుదీప బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. గత సారి కూడా సుదీప డేంజర్ జోన్ లో ఉన్నారు. సుదీప ఎవిక్షన్‌తో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు 15 మంది హౌస్ మేట్స్ ఉంటారు.

ఆట ఎలా ఆడినా .. ఆట‌లో ఓడినా కానీ మ‌న‌సుల‌ను గెల‌వ‌డం చాలా ముఖ్యం. ఈ విష‌యంలో గ‌త సీజ‌న్ల‌లో ప‌లువురు హౌస్ మేట్స్ గొప్ప పేరు తెచ్చుకున్నారు. బాలాదిత్య లాంటి నటుడు సౌమ్యుడు ఆ స్థాయికి చేరుతాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ లో కొత్త‌గా ప్ర‌వేశించిన చాలామంది మోడ‌ల్స్ ఇత‌ర‌ తార‌లకు సినిమా ఛాన్సులు వ‌స్తున్నాయి. వాటిని స‌ద్వినియోగం చేసుకుని ఎద‌గ‌డం కెరీర్ ప‌రంగా చాలా కీల‌కం.