Begin typing your search above and press return to search.

13 ఏళ్ల తర్వాత మార్పు.. పునీత్ కు సుదీప్ ఇదే నివాళి

By:  Tupaki Desk   |   31 Oct 2021 9:30 AM GMT
13 ఏళ్ల తర్వాత మార్పు.. పునీత్ కు సుదీప్ ఇదే నివాళి
X
కన్నడ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్‌ మృతి పట్ల సినిమా లోకం మొత్తం కన్నీరు పెట్టుకుంది. సౌత్ కు చెందిన స్టార్స్ పలువురు ఆయనకు కడసారి నివాళ్లు అర్పించారు. బెంగళూరుకు పెద్ద ఎత్తున ప్రముఖులు చేరుకుని పునీత్ రాజ్ కుమార్‌ మృత దేహంను చూసి చలించి పోయారు. బాలకృష్ణ తో పాటు ఇంకా పలువురు ప్రముఖులు తమ కన్నీటిని ఆపేకోలేక బయటకు వదిలేశారు. ఇక ఆయన తోటి హీరోలు షాక్ నుండి తేరుకోలేక పోతున్నామంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. కన్నడ స్టార్‌ కిచ్చ సుదీప్ చాలా ఎమోషనల్‌ అయ్యాడు. వీరిద్దరు మంచి స్నేహితులు. ఇండస్ట్రీలో హీరోల మద్య ఉండే పోటీ తత్వం కాని గొడవలు కాని వీరి మద్య ఉండేది కాదు. వీరు ఇద్దరు కూడా దాదాపుగా నాలుగు దశాబ్దాల స్నేహితులు.

పునీత్‌ మృతి పట్ల సుదీప్‌ సోషల్‌ మీడియా ద్వారా తన దిగ్ర్బాంతిని వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో తన డీపీని మార్చాడు. చిన్నప్పుడు పునీత్ తో తాను కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేయడంతో పాటు తన ట్విట్టర్ డీపీగా పునీత్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పెట్టడం జరిగింది. సుదీప్‌ ట్విట్టర్ అకౌంట్‌ ను 13 ఏళ్ల క్రితం ఓపెన్‌ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా సుదీప్ తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చకుండా అలాగే ఉంచాడు. ఇన్నాళ్ల తర్వాత పునీత్ రాజ్ కుమార్‌ ఫొటో పెట్టడం ద్వారా ఘన నివాళి సమర్పించాడు. పునీత్‌ కు సుదీప్ ఇంతకు మించిన ఘన నివాళి ఏముంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకా పునీత్‌ గురించి సుదీర్ఘమైన లేఖను రాసి సోషల్‌ మీడియాలో సుదీప్‌ పోస్ట్‌ చేశాడు. అందులో మొదటి సారి నిన్ను శివ మొగ్గలో కలిశాను. ఆ సమయంలోనే మనం మంచి స్నేహితులం అయ్యాం. అప్పటికే నువ్వు బాల నటుడిగా చాలా సినిమాలు చేసి స్టార్‌ వు అయ్యావు. నీ తో కలిసిన ప్రతి సందర్బం కూడా నాకు ప్రత్యేకమైనది అంటూ సుదీప్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఇద్దరు కూడా ఒకరి సినిమాల ఫంక్షన్స్ కు మరొకరు వెళ్లే వారు. ఇద్దరు కూడా ఒకరి సినిమాల గురించి ఒకరు స్పందిస్తూ మంచి స్నేహ పూర్వక వాతావరణం మెయింటెన్ చేసేవారు. అలాంటి స్నేహితుడు మృతి చెందడంతో కిచ్చ సుదీప్‌ కన్నీటి పర్యంతం అవుతున్నాడు.