Begin typing your search above and press return to search.

రెడ్డిగారితో ఈగ విలన్ గొడవ పడతాడా?

By:  Tupaki Desk   |   3 Aug 2017 11:54 AM GMT
రెడ్డిగారితో ఈగ విలన్ గొడవ పడతాడా?
X
'ఈగ' అనే ఒక్క సినిమాతో ఎంటైర్ తెలుగు ఇండస్ర్టీని తనవైపు తిప్పుకున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఆ తరువాత తెలుగులో కేవలం బాహుబలి సినిమాలో ఒక సీన్లో మాత్రమే మెరిశాడు. అయితే ఇప్పుడు మనోడు రెడ్డిగారితో గొడవ పడ్డానికి రెడీ అవుతున్నాడు. మామూలు రెడ్డిగారితో కాదండోయ్.. ఏకంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'తో కత్తులు దూస్తాడట.

నిజానికి మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కంటే 151ని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లున్నారు. పైగా ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తో రూపొందిస్తుండటంతో.. సినిమాలో కాస్త వైవిధ్యబరితమైన క్యాస్టింగ్ ను దించితే.. సినిమా రేంజ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఆల్రెడీ హీరోయిన్ గా చేయడానికి 9 కోట్లు అడిగిన ఐశ్వర్య రాయ్ ను పక్కనెట్టేసి.. స్వయంగా అమితాబ్ బచ్చన్ తోనే ఒక చిన్న రోల్ చేయిస్తున్నారని టాక్. అలాగే నయనతార కూడా హీరోయిన్ గా ఒప్పుకుందట. అసలు ఈ సినిమాలో మరి విలన్ గా ఎవరు అంటే.. బ్రిటీష్‌ వారి పాత్రలను పోషించడానికి ఇంగ్లీష్‌ నటులనే ఎంచుకుంటున్నారు కాని.. తెలుగు వారైయుండి ఉయ్యాలవాడకు ద్రోహం చేసే ఒక పాత్రను మాత్రం.. సుదీప్ కు ఆఫర్ చేశారట. మనోడు కూడా చిరంజీవితో గొడవ అనగానే రెడీగానే ఒప్పేసుకుంటాడని అనుకుంటున్నారు సినిమా లవర్స్. కాకపోతే దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

ఉయ్యాలవాడ సినిమాను దేశభక్తిగా ప్రతీకగా వచ్చే ఆగస్టు 15కు మొదలెడతారని ఒక టాక్ ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 22న మొదలుపెడతారని మరో టాక్ ఉంది. వెయిట్ అండ్ సి.