Begin typing your search above and press return to search.

అత‌ను ప‌వ‌న్ సినిమాల్ని వ‌ద‌ల‌ట్లేదు

By:  Tupaki Desk   |   21 Nov 2015 5:43 AM GMT
అత‌ను ప‌వ‌న్ సినిమాల్ని వ‌ద‌ల‌ట్లేదు
X
ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ సినిమాలు క‌న్న‌డ హీరో సుదీప్‌ కి బాగా అచ్చొచ్చిన‌ట్టున్నాయి. ఈమ‌ధ్యే అత్తారింటికి దారేదిని క‌న్న‌డ‌లో రానాగా రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. తెలుగులో అత్తారింటికి దారేది ఏ స్థాయిలో ఆడిందో క‌న్న‌డ‌లో రానా కూడా అదే స్థాయిలో ఆడింది. దీంతో సుదీప్ స్టార్ స్టేట‌స్ మ‌రింతగా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ సినిమాని రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో సుదీప్ ఉన్న‌ట్టు తెలిసింది. ఈసారి `గోపాల గోపాల`పై సుదీప్ మ‌న‌సుప‌డ్డాడ‌ని తెలిసింది. హిందీలో విజ‌య‌వంత‌మైన ఓ మై గాడ్‌ కి రీమేక్‌ గా తెర‌కెక్కింది గోపాల గోపాల‌. అందులో ప‌వ‌న్‌ తో పాటు వెంక‌టేష్ న‌టించాడు. క‌మ‌ర్షియ‌ల్‌ గా చెప్పుకోద‌గ్గ హిట్టేమీ కాదు కానీ...విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్రం ల‌భించాయి. అభిమానుల‌కీ ఆ సినిమా బాగా న‌చ్చింది. ఇప్పుడు అదే సినిమాని క‌న్న‌డ‌లో సుదీప్‌ - ఉపేంద్ర క‌లిసి చేయ‌బోతున్నార‌ట‌.

తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన దేవుడి పాత్ర‌ని క‌న్న‌డ‌లో సుదీప్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. దేవుడిపైనే కేసు పెట్టే వెంక‌టేష్ పాత్ర‌ని క‌న్న‌డ‌లో ఉపేంద్ర చేయ‌బోతున్నాడ‌ట‌. నిజంగానే వారి స్టైల్స్‌ కి త‌గిన పాత్ర‌ల‌వి. అందుకే ఆ ఇద్ద‌రూ కూడా గోపాల గోపాల రీమేక్‌ పై ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే సెట్స్‌ పైకి వెళ్ల‌నున్న ఆ చిత్రం క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ గా నిలవ‌డం ఖాయమ‌ని శాండిల్ వుడ్ వ‌ర్గాలు న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. చూస్తుంటే భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ న‌టించిన సినిమాల్ని సుదీప్ వ‌దిలిపెట్టేలా క‌నిపించ‌డం లేదు.