Begin typing your search above and press return to search.

సడెన్‌ ట్విస్ట్‌ ఇచ్చిన యాంగ్రీయంగ్‌ మన్‌

By:  Tupaki Desk   |   11 Jun 2019 7:46 AM GMT
సడెన్‌ ట్విస్ట్‌ ఇచ్చిన యాంగ్రీయంగ్‌ మన్‌
X
'గరుడవేగ' ఇచ్చిన సక్సెస్‌ జోష్‌ తో యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ 'కల్కి' చిత్రాన్ని చేశాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రంలో అదా శర్మ హీరోయిన్‌ గా నటించింది. పీరియాడిక్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొదటి నుండి ఈ చిత్రంను మే చివర్లో విడుదల చేయాలని భావించారు. అయితే సినిమా విడుదల సమయంకు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి కాలేదు అంటూ వాయిదా వేయడం జరిగింది.

'కల్కి' సినిమా జులై ఆగస్టు నెలల్లో వచ్చే అవకాశం ఉందని వాయిదా అనంతరం వార్తలు వచ్చాయి. కల్కి గురించిన వార్తలు పూర్తిగా తగ్గిన సమయంలో అనూహ్యంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. ఈనెలలోనే సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. అన్ని కార్యక్రమాలు చకచక పూర్తవుతున్నట్లుగా చెప్పాడు.

జూన్‌ 28 అంటూ ప్రకటించిన ప్రశాంత్‌ వర్మ ప్రమోషన్‌ కార్యక్రమాలను మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. సినిమా విడుదలకు కొద్ది సమయమే ఉంది. ఇలాంటి సమయంలో సినిమా వర్క్‌ ఇంకా బ్యాలన్స్‌ ఉంది. బ్యాలన్స్‌ వర్క్‌ పూర్తి చేసి.. ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. సడెన్‌ గా విడుదల తేదీ ప్రకటించడంతో ఈనెల చివర్లో విడుదల ప్లాన్‌ చేసుకున్న చిన్న చిత్రాలు ప్రస్తుతం సందిగ్దంలో పడ్డట్లుగా తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం మళ్లీ కల్కి వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే సినిమా జూన్‌ 28న రావడం పక్కా అనిపిస్తోంది.