Begin typing your search above and press return to search.

ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మరణంపై బోలెడు సందేహాలు?

By:  Tupaki Desk   |   2 Sept 2021 2:17 PM IST
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మరణంపై బోలెడు సందేహాలు?
X
మొన్న బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం.. ఇప్పుడు మరో నటుడు సిద్ధార్థ్ శుక్లా అనుమానాస్పద మృతి.. ఇలా బాలీవుడ్ లో అంతుచిక్కని అనుమానాస్పద మృతులు కలకలం రేపుతున్నాయి.
నటుడు, బిగ్ బాస్ 13వ సీజన్ విజేత సిద్ధార్థ్ శుక్లా అనుమానాస్పద మృతిపై ఇప్పుడు అందరికీ బోలెడు అనుమానాలు కలుగుతున్నాయి. ముంబైలోని కూపర్ హాస్పిటల్ సిద్ధార్థ్ మరణించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారని అంటున్నారు.కానీ ఎంతో ఫిట్ గా ఉండే సిద్ధార్థ్ ఇలా గుండెపోటుతో మరణించాడంటే ఎవరికీ నమ్మకం కలగడం లేదు.

ప్రముఖ నటుడు సిద్ధార్థ్ శుక్లా గురువారం కన్నుమూసినట్లు కూపర్ ఆస్పత్రి అధికారి తెలిపారు. అతడి వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు.. శుక్లాకు ఈ ఉదయం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. శుక్లాకి తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారని అంటున్నారు. సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణంతో బాలీవుడ్, టీవీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నటులు, నటీమణులందరూ సిద్ధార్థ్ కు నివాళులర్పిస్తున్నారు.

టీవీ పరిశ్రమలో మంచి పేరున్న సిద్ధార్థ్ శుక్లా రియాలిటీ షో బిగ్ బాస్ 13వ సీజన్ ను గెలుచుకున్నాడు. ఇదీ కాకుండా అతడు ఖత్రోస్ కే ఖిలాది ఏడో సీజన్ ను కూడా గెలుచుకున్నాడు. బాలికా వధు సీరియల్ నుంచి సిద్ధార్థ్ శుక్లా దేశంలోని ప్రతి ఇంట్లో తనదైన ముద్ర వేశాడు. బిగ్ బాస్ 13 సక్సెస్ తర్వాత సిద్ధార్థ్ శుక్లాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. నటి షహనాజ్ గిల్ తో అతడి అనుబంధం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంది.

1980 డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2004లో అతడు టీవీలో కెరీర్ ప్రారంభించాడు. 2008లో తొలిసారి అతడు ‘బాబూల్ కా అంగన్ చోటే’ అనే టీవీ సీరియల్ లో కనిపించాడు. ‘బాలిక వధు’ సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీ అయ్యాడు.

శుక్లా చివరిసారిగా ఏక్తాకపూర్ ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్3’లో అగస్త్య అనే పాత్రలో నటించాడు. నటుడు సిద్ధార్థ్ రాత్రి నిద్రపోయే ముందు కొన్ని మాత్రలు వేసుకున్నాడని.. ఆ తర్వాత అతడు లేవలేకపోయాడని అంటున్నారు. అతడు ఏ మందులు తీసుకున్నారనే సమాచారం మాత్రం అందలేదు. గుండెపోటుతో మరణించనట్టు వైద్యులు తెలిపారు. మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం ఏ విషయం తేలుతుంది.