Begin typing your search above and press return to search.

షాక్‌: అంత పెద్ద బ‌డ్జెట్ అప్పు పుట్టడం లేద‌ట‌!!

By:  Tupaki Desk   |   31 Aug 2020 10:45 AM IST
షాక్‌: అంత పెద్ద బ‌డ్జెట్ అప్పు పుట్టడం లేద‌ట‌!!
X
భారీ పాన్ ఇండియా సినిమాలు తీయ‌డం అంటే ఆషామాషీనా? అందుకు త‌గ్గ‌ట్టే డ‌బ్బును మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేయాలి. భారీగా అప్పులు తేవాలి. ద‌ర్శ‌కుడు పెట్టించినంతా విధిలించేందుకు గ‌ట్స్ చూపించాలి. పైగా క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఇప్ప‌టికే పాన్ ఇండియా సినిమాలు తీసేవాళ్లంతా క‌ళ్లు తేలేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో భారీ పాన్ ఇండియా సినిమాని ప్ర‌క‌టించిన ఆ అగ్ర నిర్మాణ సంస్థ‌కు నానా అగ‌చాట్లు త‌ప్ప‌డం లేద‌ట‌. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో ఇండ‌స్ట్రీ బెస్ట్ హీరోతో సినిమాని ప్ర‌క‌టించిన స‌ద‌రు నిర్మాత‌ల‌కు అప్పు పుట్ట‌డం కాస్తంత క‌ష్టంగానే ఉంద‌ట‌.

హీరోకి.. హీరోయిన్ కి అడ్వాన్సులు ఇచ్చి భారీ పారితోషికాలు చెల్లిస్తామ‌ని డీల్ కుదుర్చుకున్నా.. కానీ సినిమాని పూర్తి చేసి బ‌య‌ట‌కు తేవ‌డం మాత్రం అంత వీజీ కాద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. పైగా ఇప్పుడున్న స‌న్నివేశంలో ఇది ఏమంత సులువు కాదేమో అన్న‌ది కొంద‌రి క్యాలిక్యులేష‌న్.

ఇక స‌ద‌రు నిర్మాణ సంస్థ ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌ను క‌లుపుకుని ముందుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందులో అల్లు అర‌వింద్.. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత‌ల స్నేహ‌హ‌స్తం కావాల‌నే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ట‌. అయితే గ‌తంలో ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ లోక‌ల్ మార్కెట్ల‌లో వ‌ర్క‌వుట‌వ్వ‌క‌పోవ‌డం కొంత‌వ‌ర‌కూ ప్ర‌తికూలంగా మారింద‌ట‌. అలాగే ఒక కుర్ర డైరెక్ట‌ర్ ని న‌మ్మి అంత పెద్ద బ‌డ్జెట్ పెట్టాస్తామంటే ఎలా? అని ఆలోచించేవాళ్లు ఉన్నార‌ట‌. అంతేకాదు.. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న హీరోగారి సినిమా రిజ‌ల్ట్ ని బ‌ట్టి కూడా మునుముందు ఫైనాన్షియ‌ర్లు డిసైడ‌య్యే ఛాన్సుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మొక్క‌వోని ధీక్ష‌తో ఈ సినిమాని పూర్తి చేయాల‌ని స‌ద‌రు నిర్మాత కూడా అంతే ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. క‌ష్టం వ‌చ్చినా ఎదురీదితేనే బాహుబ‌లి రేంజులో సంచ‌ల‌నాల‌కు ఆస్కారం ఉంటుంది. ప‌డ్డ శ్ర‌మంతా మ‌ర్చిపోయే రోజొస్తుంది. అలా కాద‌ని ఏటికి ఎదురీద‌లేక చేతులెత్తేస్తే మాత్రం ప్ర‌క‌ట‌న వెలువ‌డ్డాక‌ అది ఘోర వైఫ‌ల్యం కిందే లెక్క‌. ఇక స‌ద‌రు అగ్ర నిర్మాత‌కు భారీ బ‌డ్జెట్ల‌తో సినిమాలు తీయ‌డం కొత్తేమీ కాదు కాబ‌ట్టి అనుకున్న‌ది సాధిస్తాడ‌నే ఒక సెక్ష‌న్ అభిమానులు భావిస్తున్నారు.