Begin typing your search above and press return to search.
'బ్లాక్ బస్టర్' ...'సక్సెస్ మీట్' ఏంటిది ?
By: Tupaki Desk | 1 Feb 2020 9:00 AM ISTసినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం షో పడిన ఐదారు గంటల్లోపే మేకర్స్ బ్లాక్ బస్టర్ అంటూ ఓ పోస్టర్ వదలడం కామన్ అయిపొయింది. అయితే పెద్ద సినిమాలు వాటి నిర్మాతలు హీరో రేంజ్ కోసం బ్లాక్ బస్టర్ అనే పోస్టర్ వదిలారంటే ఏదో అనుకోవచ్చు కానీ కొన్ని చిన్న సినిమాల పోస్టర్స్ మీద బ్లాక్ బస్టర్ అంటూ అనిపించడం ఆడియన్స్ కు నవ్వు తెప్పిస్తుంది. చిన్న సినిమాలు కనీసం హిట్ , సూపర్ లాంటివి కాకుండా బ్లాక్ బస్టర్ అంటూ వేసుకోవడం దారుణం అనిపిస్తుంది.
ఇటివలే తమ నిర్మాతలకు పోస్టర్ మీద బ్లాక్ బస్టర్ అని ముద్ర వేసే వరకూ వదల్లేదట హీరో. ఆయన గారి పైత్యానికి పాపం నిర్మాత బలయ్యాడట. అంతే కాదు రిలీజైన తెల్లారే ఓ థాంక్స్ మీట్ పెట్టడం అనేది ఓ ఆనవాయితీగా మారింది. అందుకే ఈ మధ్య కీరవాణి లాంటి పెద్ద మనిషి కూడా సక్సెస్ మీట్ పై సెటైర్ వేసారు.
ఇవేవి పట్టించుకోకుండా మార్నింగ్ షో కి డబ్బులు రాకపోయినా పోస్టర్ మీద బ్లాక్ బస్టర్ అని వేసుకోవడం తెల్లారే సక్సెస్ మీట్ పేరిట మీడియాలో ఫేక్ కలెక్షన్స్ చెప్పుకోవడం దేనికో వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా కొన్ని రోజుల్లో బ్లాక్ బస్టర్ వేసుకోవాలంటేనే స్టార్ హీరోలకు సిగ్గేసే పరిస్థితి తీసుకొస్తున్నారు చిన్న హీరోలు.