Begin typing your search above and press return to search.

పవన్‌ అయిన బ్యాడ్‌ స్క్రిప్ట్‌ తో సక్సెస్‌ కష్టం

By:  Tupaki Desk   |   12 July 2021 6:31 AM GMT
పవన్‌ అయిన బ్యాడ్‌ స్క్రిప్ట్‌ తో సక్సెస్‌ కష్టం
X
పవన్‌ వరుస ప్లాప్ ల్లో ఉన్న సమయంలో గబ్బర్‌ సింగ్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో అలాంటి బ్యాక్‌ డ్రాప్ తో మళ్లీ సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాను పవన్‌ చేశాడు. ఆ సినిమాకు దర్శకత్వ బాధ్యతను బాబీ నిర్వహించాడు. అప్పటికి ఆయన కేవలం ఒకే ఒక్క సినిమా పవర్‌ ను తెరకెక్కించాడు.

ఒక్క సినిమాతోనే పవన్‌ తో సినిమా ను చేసే అవకాశం ను బాబీ దక్కించుకున్నాడు. ఆ సినిమా పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ లో మరో హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు. కాని సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా ప్లాప్ గా మిగిలింది. పవన్‌ మూవీ అంటే ప్రేక్షకులు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఆశిస్తారు అనే ఉద్దేశ్యంతో సినిమాలో కామెడీ ని కాస్త ఎక్కువ జొప్పించే ప్రయత్నం చేశారు. కాని సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ స్క్రిప్ట్‌ విషయంలో ఎక్కువ వర్క్‌ చేయలేదు అనిపించింది.

తాజాగా ఒక మీడియా సంస్థతో దర్శకుడు బాబీ మాట్లాడుతూ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ప్లాప్‌ పై స్పందించాడు. ఒక పవన్ అభిమానిగా నేను సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాను చేశాను. కాని అభిమానులను సంతృప్తి పర్చే విధంగా సినిమాను తెరకెక్కించలేక పోయాను. సినిమాపై ఉన్న అంచనాలను అందుకోలేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు. రెండవ సినిమాకే నాకు పవన్‌ కళ్యాణ్‌ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని.

ఒక దర్శకుడిగా ఆ విషయం నాకు ఎప్పటికి గౌరవమే. కాని సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ను సక్సెస్ చేయడంలో విఫలం అయ్యాను. స్క్రిప్ట్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు పడి ఉంటే బాగుండేది. ఆ సమయంలోనే నేను ఎంత పెద్ద స్టార్‌ అయినా కూడా స్క్రిప్ట్‌ సరిగా లేకుంటే సక్సెస్ కాలేరు అని తెలుసుకున్నాను. స్టార్‌ తో సినిమాలు సక్సెస్‌ అవ్వవు.. స్క్రిప్ట్‌ మొదటి స్టార్‌ అని నేను నమ్ముతాను అంటూ బాబీ చెప్పుకొచ్చాడు.

స్టార్‌ హీరోలు అయినా కూడా స్క్రిప్ట్‌ విషయంలో శ్రద్ద పెట్టకుండా ఏదో చేశాం అనుకుంటే మాత్రం కష్టం అంటూ గతంలో వచ్చిన పలు సినిమాలు నిరూపించాయి. అందులో భాగంగానే సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ కూడా స్క్రిప్ట్‌ సరిగా లేని కారణంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్నా కూడా మంచి మార్కులు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ లు మంచి స్క్రిప్ట్‌ లతో సినిమాలు చేస్తే ఇండస్ట్రీ హిట్‌ అవుతాయి. స్క్రిప్ట్‌ మరియు స్టార్‌ హీరో ఉంటేనే ఏ సినిమా అయినా బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస్‌ లుగా నిలుస్తాయి.

ఇక దర్శకుడు బాబీ ప్రస్తుతం మెగా స్టార్‌ చిరంజీవితో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ తో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ వంటి ప్లాప్‌ మూవీ తీసినా కూడా చిరంజీవి వంటి బిగ్గెస్ట్‌ స్టార్‌ అవకాశం ఇచ్చాడు అంటే ఆయనపై ఎంత నమ్మకంను చిరంజీవి పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అద్బుతమైన స్క్రిప్ట్‌ ను ఈసారి చిరంజీవి కోసం ఈయన చేశాడని అంటున్నారు. మెగా ఫ్యాన్స్‌ ను సర్దార్‌ గబ్బర్‌ సింగ్ తో నిరాశ పర్చిన బాబీ కనీసం మెగాస్టార్‌ తో చేయబోతున్న సినిమాతో అయినా సక్సెస్ దక్కించుకునేనా చూడాలి.