Begin typing your search above and press return to search.

బన్నీ కథ కాదు బాబోయ్.. బన్నీ కథ కాదు

By:  Tupaki Desk   |   17 Sept 2015 1:38 PM IST
బన్నీ కథ కాదు బాబోయ్.. బన్నీ కథ కాదు
X
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఈ సినిమా కథ సాయిధరమ్ తేజ్ కోసమే పుట్టిందన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కానీ ఓ స్టార్ హీరో కోసం రాసిన కథకు తనను ఎంచుకోవడం తన అదృష్టమని సాయిధరమ్ అనడంతో ఏది వాస్తవమో జనాలకు అర్థం కాలేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలకు ముందు బన్నీతో హరీష్ కు ఉన్న కమిట్ మెంట్ ఆ తర్వాత.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో రద్దయిందని.. దీంతో బన్నీ కాదన్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథనే సాయిధరమ్ తో తీయాల్సి వచ్చిందన్న ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా ఉంది.

ఐతే ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు హరీష్. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ తర్వాత తనతో స్టార్ హీరోలు జంకిన మాట వాస్తవమే అని.. ఐతే బన్నీ మాత్రం తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని.. కానీ తనకు తగ్గ కథ రెడీ చేయలేకపోవడం వల్లే అతడితో సినిమా చేయలేకపోయానని అన్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ కథ బన్నీ కోసం రెడీ చేసింది కాదని నొక్కి వక్కాణించాడు.

సుబ్రమణ్యం క్యారెక్టరైజేషన్ ఎప్పుడో రాసి పెట్టుకున్నదని.. మిరపకాయ్ తర్వాత చేయాలని చూశానని.. కానీ ఎవరితో చేయాలా అన్న సందిగ్ధంలో ఉండేవాణ్నని.. ఐతే సాయిధరమ్ ను చూశాక అతను ఆ పాత్రకు సెట్టవుతాడని భావించి.. అతడి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో కథ తయారు చేశానని హరీష్ చెప్పాడు. బన్నీతో చేయడానికి వేరే క్యారెక్టరైజేషన్ తో ఓ కథ అనుకున్నానని.. కానీ ఆ సినిమాకు పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ చేయలేకపోవడంతో బన్నీని మళ్లీ కలవలేదని చెప్పాడు.