Begin typing your search above and press return to search.

ఈ ఆదివారం మ్యూజికల్ వార్

By:  Tupaki Desk   |   19 Aug 2015 12:15 PM GMT
ఈ ఆదివారం మ్యూజికల్ వార్
X
రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై పోటీ పడటం చూశాం. ఇప్పుడు సినిమాల ఆడియో ఫంక్షన్ల విషయంలోనూ పోటీ తప్పట్లేదు. ఈ నెల 23న, ఆదివారం టాలీవుడ్ లో రెండు ప్రముఖ సినిమాల ఆడియో ఫంక్షన్లు జరగబోతున్నాయి. అందులో ఒకటి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీది కాగా.. ఇంకోటి నితిన్ సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ది. ఈ రెండు సినిమాలూ సంగీత ప్రధానమైనవే. రెండు ఫంక్షన్లనూ భారీ స్థాయిలో నిర్వహించబోతుండటంతో ఈ ఆదివారం మ్యూజికల్ వార్ జరగబోతున్నట్లే.

ఈ రెండు సినిమాలకూ కొంచెం భిన్నమైన నేపథ్యాలే ఉన్నాయి. ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి డిజాస్టర్ తర్వాత హరీష్ శంకర్ రూపొందించిన మూవీ సుబ్రమణ్యం ఫర్ సేల్. నిజానికిది అల్లు అర్జున్ కోసం తయారు చేసిన కథ. ఐతే రామయ్యా వస్తావయ్యా ఫలితం తర్వాత బన్నీ సైడైపోయాడు. దీంతో హిట్టు కొట్టి తనేంటో చూపించాలన్న కసితో ఉన్నాడు హరీష్. మామూలుగా యాక్షన్ మీదే దృష్టిపెట్టే హరీష్.. ఈసారి తనలోని రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించబోతున్నాడని ఆడియో టీజర్ ను చూస్తే తెలుస్తోంది. ఇప్పటిదాకా మాస్ మ్యూజిక్ డైరెక్టర్ల తోనే పని చేసిన హరీష్.. ఈసారి మిక్కీ జే మేయర్ లాంటి క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకోవడం విశేషం. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది సినీ ప్రముఖులు ఈ ఆడియో ఫంక్షన్ కు రాబోతున్నారు.

ఇక ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విషయానికొస్తే ఎప్పుడో రెండేళ్ల కిందట విడుదల కావాల్సిన ఈ సినిమా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ప్రేమ్ సాయి దర్శకుడు. గాయకుడు కార్తీక్ తో పాటు అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పని చేశారు. టీజర్స్ చూస్తుంటే పాటలు చాలా బావుండేట్లే అనిపిస్తున్నాయి. చాన్నాళ్లు మరుగున ఉండిపోయిన సినిమా కాబట్టి.. ఆడియో ఫంక్షన్ కొంచెం గ్రాండ్ గా చేసి.. హైప్ తేవాలని చూస్తున్నారు గౌతమ్, నితిన్.