Begin typing your search above and press return to search.

'పాన్ ఇండియా స్టార్' అనిపించుకోడానికి ట్రై చేస్తున్న స్టార్ హీరో...!

By:  Tupaki Desk   |   1 Aug 2020 12:00 PM IST
పాన్ ఇండియా స్టార్ అనిపించుకోడానికి ట్రై చేస్తున్న స్టార్ హీరో...!
X
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ తమ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ అక్కడ కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ అనౌన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఆశ పడుతున్నారు. అందుకే క్రేజ్ తో ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ హీరోలైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదితరులు ఆ వైపుగా అడుగులు వేశారు. ఇక స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు టాలీవుడ్ మాలీవుడ్ ల మీద ఫోకస్ పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప'ని తెలుగుతో పాటు త‌మిళ‌ మ‌ల‌యాళ‌ క‌న్న‌డ‌ హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

కాగా 'అల వైకుంఠపురములో' సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇకపై అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కెరీర్లో 21వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యూనివర్సల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ మరియు గీతాఆర్ట్స్ 2 అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తం మీద బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పుష్ప' రిలీజ్ అయితే కానీ అతని ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చెప్పలేము.