Begin typing your search above and press return to search.

బ‌న్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం

By:  Tupaki Desk   |   14 Dec 2020 10:05 AM IST
బ‌న్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం
X
నిశ్చయ్ డెస్టినేష‌న్ వెడ్డింగ్ ఇటీవ‌ల గూగుల్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాహంలో మెగా అల్లు హీరోల సంద‌డి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ పెళ్లికి ప్ర‌త్యేక విహంగంలో మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ ప్ర‌యాణించాయి.

ఈ ప్ర‌యాణంలో అల్లు అర్జున్ కి ఊహించ‌ని విధంగా ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది. అత‌డిని ఉదయపూర్ విమానాశ్రయ సిబ్బంది చప్పట్లు కొట్టి మ‌రీ భినందించారు. బ‌న్నీకే ఎందుకంత గౌర‌వం అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా రెండు విష‌యాల్ని ప్ర‌తి ఒక్క‌‌రూ విడిచిపెట్ట‌కుండా గ‌మ‌నిస్తారు. అందులో ఒక‌టి అత‌డి స్టైల్ .. రెండవది అత‌డి సామాజిక బాధ్య‌త‌.. ప్ర‌వ‌ర్త‌న‌లో గొప్ప‌ ప‌రిణ‌తి.

నిహారిక కొణిదెల‌ వివాహ మ‌హోత్స‌వం కోసం ఉదయపూర్ విమానాశ్ర‌యం‌లో దిగిన బ‌న్ని ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌నిపించారు. విమానాశ్రయంలో ఉన్నప్పుడు అతని క్రమశిక్షణ నిజంగా అక్క‌డ‌ అధికారులను విశిష్ఠంగా ఆకర్షించింది. వైమానిక సిబ్బంది ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఉదయపూర్ విమానాశ్రయంలో అల్లు అర్జున్ మాస్క్ ధరించి నిబంధనలను పాటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బ‌న్ని ముసుగు ధరించిన ఫోటోని కూడా షేర్ చేశారు. ప్ర‌యాణీకులు సుర‌క్షితంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌ను చేరాలంటే బ‌న్నీలానే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండాల‌న్న సందేశం బ‌లంగా వెళ్లినందుకు హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

మొత్తానికి బ‌న్నీకి అరుదైన గౌర‌వం ద‌క్క‌డంపై అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ స్టార్ ఎక్క‌డ ఉన్నా త‌నదైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటార‌ని అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌తి స్టార్ కి ఇలాంటి అరుదైన గౌర‌వం లభించదు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా బ‌న్ని అభిమానుల‌కు ఇది గర్వకారణం. నిహారిక పెళ్లి ఆద్యంతం బ‌న్ని-స్నేహ జంట స్టైలిష్ లుక్ పైనా స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.