Begin typing your search above and press return to search.

స్పైసీ లుక్కుతో హీట్ పెంచిన కియారా

By:  Tupaki Desk   |   19 March 2020 11:50 AM GMT
స్పైసీ లుక్కుతో హీట్ పెంచిన కియారా
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ బాట పట్టిన హాట్ భామ కియారా అద్వానీ. తొలి చిత్రంతోనే అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకుంది. మొదటి సినిమా ఇచ్చిన జోష్ తో వెంటనే రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఈ సినిమా పరాజయం పాలైన కియారా అందాల ఆరబోతకు అవకాశం కల్పించింది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన 'గిల్టీ' ద్వారా అందరూ మరోసారి తనవైపు చూపు తిప్పుకొనేలా చేసింది. కెరీర్ ప్రారంభం నుండి మంచి కథా బలమున్న చిత్రాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని పొందింది కియారా. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతలో కూడా ఎక్కడా రాజీపడట్లేదు. సినిమాలతోనే కాదు ఫోటో షూట్ లతో కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. ఇటీవల పచ్చని ఆకు చాటున టాప్ లెస్ భంగిమతో పిచ్చెక్కించిన ఆమె ఫోటో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చిన కియారా తానెంత గ్లామర్ గా సినిమాల్లో నటించగలనో అని ఈ హాట్ ఫోటో షూట్ తో చెప్పకనే చెప్పింది. మ్యాగజైన్ కోసం కియారా అద్వానీ చేయించుకున్న ఈ హాట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూవుంది. హాట్ లుక్ తో కియారా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కియారా హాట్ ఫోటో చూసిన ఎవ్వరైనా.. అబ్బా కియారా కిర్రాక్ పుట్టించిందిగా అనక మానరు. మరి ఈ రేంజ్ అందాలు ఆరబోస్తున్న కియారాకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా రెడ్ కార్పెట్ పరిచేలా ఉన్నారు. ఈ అందాల ఆరబోత కియారాకు ఏ మాత్రం ఛాన్సులు తెచ్చిపెడుతుందో అనేది చూడాలి.